కరోనాతో మరో సినిమా వాయిదా.. వెంకటేష్‌ `నారప్ప` పోస్ట్ పోన్‌

Published : Apr 29, 2021, 11:30 AM IST
కరోనాతో మరో సినిమా వాయిదా.. వెంకటేష్‌ `నారప్ప` పోస్ట్ పోన్‌

సారాంశం

వెంకటేష్‌ హీరోగా నటించిన `నారప్ప` చిత్రాన్ని వాయిదా వేశారు. కరోనా విజృంభన మరింతగా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

కరోనా దెబ్బకి చిత్ర పరిశ్రమ విలవిలలాడుతున్నది. ఓ వైపు స్టార్స్ కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు షూటింగ్‌లన్నీ క్రమంగా ఆగిపోతున్నాయి. దీనికితోడు థియేటర్లు స్వచ్ఛందంగా బంద్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాదు సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి `ఆచార`, నాని `టక్‌ జగదీష్‌`, రానా, సాయిపల్లవి `విరాటపర్వం`, నాగచైతన్య `లవ్‌ స్టోరి` చిత్రాలు వాయిదా పడ్డాయి. వీరి బాటలోనే విక్టర్‌ వెంకటేష్‌ కూడా ఉన్నారు. 

వెంకటేష్‌ హీరోగా నటించిన `నారప్ప` చిత్రాన్ని వాయిదా వేశారు. కరోనా విజృంభన మరింతగా పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమాని పోస్ట్ పోన్‌ చేస్తున్నట్టు వెంకటేష్‌ తెలిపారు. `నారప్ప` సినిమా కోసం ఎంతగానో ఎదరుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు, అందరికి మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకుని చిత్రం విడుదల వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత  ఈ సినిమాని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మహమ్మారి వీలైనంత త్వరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈ చిత్రానికి ఇష్టంతోనూ, అంకిత భావంతోనూ పనిచేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అందరం ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటిద్దాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసి కట్టుగానే ఎదుర్కొందాం` అని తెలిపారు. 

`అందరం మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తూ ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ సమాజానికి చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నందరినీ అలరించాలని కోరుకుంటూ `నారప్ప` టీమ్‌` అని తెలిపింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `అసురన్‌`కిది రీమేక్‌. తెలుగులో దీన్ని సురేష్‌ ప్రొడక్షన్‌, వీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తుంది. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్