ఎయిర్ టెల్ సిగ్నల్ సమస్యలపై హీరో సుమంత్ సూపర్ సెటైర్

Published : Jan 10, 2018, 09:06 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఎయిర్ టెల్ సిగ్నల్ సమస్యలపై హీరో సుమంత్ సూపర్ సెటైర్

సారాంశం

తాజాగా మళ్లీ రావా చిత్రం హిట్ తో హేపీగా వున్న సుమంత్ తన హేపీనెస్ కు సమస్యగా మారిందో మరేంటో గానీ.. ఎయిర్ టెల్ సిగ్నల్ సమస్యలపై ట్వీట్ తో పంచ్ విసిరిన హీరో సుమంత్

టాలీవుడ్‌లో మళ్లీ రావాతో హిట్ కొట్టిన సుమంత్ తాజాగా.. ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ ‘ఎయిర్‌టెల్’కు చురకలు అంటించాడు. ఫోన్ నెట్‌వర్క్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమంత్.. ట్విట్టర్ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏర్పడుతున్న నెట్‌వర్క్ సమస్యలకు ‘కాల్ డ్రాపింగ్’ అని పేరు పెట్టినందుకు ఎయిర్ టెల్ నిర్వాహకులపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు సుమంత్. 


‘‘కాల్ డ్రాపింగ్ ఆర్ట్‌ను ప్రతి రోజు విజయవంతగా నిర్వహిస్తున్నారు. ఎయిర్‌టెల్‌కు అభినంద‌న‌లు.’’ అని సుమంత్‌ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. సుమంత్ చేసిన ఈ ట్వీట్‌ను మంచు ల‌క్ష్మి కూడా రీట్వీట్ చేయడం గమనార్హం. దీనిపై ఎయిర్‌టెల్ ప్రతినిధులు స్పందించినా.. కేవలం ఆయన ఫోన్ నెంబరును మాత్రమే అడిగి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో, సుమంత్ ఫాలోవర్లు కొందరు.. నెంబర్లు తీసుకోవడం మానేసి, కాల్ డ్రాపింగ్‌కు శాస్వత పరిష్కారం చూపాలని డిమాండు చేశారు.

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్