
తెలుగులో సుమ గురించి తెలియని వారు ఎవరు...దాదాపు ప్రతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆమె కనపడి ఆడియన్స్ ని తన పంచ్ లతో నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. పెద్ద సినిమాలు సైతం ఆమె లేనిదే ఈవెంట్ చేయవు. ఆమె టీవి షోలు కూడా రెగ్యులర్ గా చేస్తూంటుంది. ముఖ్యంగా ఈటివీ కోసం ఆమె చేస్తున్న క్యాష్ షో చాలా ఫేమస్. ఆ షోకు సంబందించన క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ క్లిప్పింగ్ లో ఏముంది. అంటే నాగార్జున తాజా చిత్రం బంగార్రాజుని ట్రోల్ చేసింది. ఈ వీడియో క్లిప్ లో డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ ఉన్నారు.
ఆమె సిద్దుని నాగార్జున చిత్రం బంగార్రాజు కు చెందిన ఫొటో క్లూలు చూపించి కథ చెప్పమంది. ఈ యంగ్ చెప్పలేకపోయారు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో యంగ్ హీరో ప్రిన్స్ ని అడిగింది. అతను కూడా ఏదో నోటికి వచ్చింది చెప్పాడు. ఇద్దరు బంగార్రాజు సినిమా చూడలేదని ఆమె అంది. ప్రక్క హీరోల సినిమాలు కూడా చూడాలని సెటైర్ వేసింది. ఆ తర్వాత ఆమెను మీరు చెప్పండి బంగార్రాజు కథ అని అడిగారు. ఆమె కూడా ఏదో చెప్పిసింది. దాంతో ఆమె కూడా సినిమా చూడలేదని అర్దమైంది. ఇలా బంగార్రాజు సినిమాని ఆడుకున్నారు. అయితే అంతా సరదాకే కాబట్టి ఎవరూ సీరిస్ గా తీసుకోరు. అందరూ నవ్వేసుకున్నారు.
ఇక అక్కినేని నాగార్జున, తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు. సంక్రాంతి పండుగనాడు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి అక్కినేని ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే థియేటర్ రన్ పూర్తిచేసుకున్న ‘బంగార్రాజు’ ఇప్పుడు ఓటీటీ ద్వారా ఇంటింటికీ వచ్చేస్తున్నాడు. జీ5లో నేడు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లలో చూసిన అభిమానులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించేందుకు మరోమారు సిద్ధమయ్యారు.
సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. కరోనా థర్ట్ వేవ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆరేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫలితంగా కరోనా కాలంలో విడుదలై విజయవంతమైన సినిమాగా రికార్డులకెక్కింది.