Keerthi Suresh First Look: న్యాయవాదిగా కీర్తి సురేష్… పస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

Published : Feb 20, 2022, 07:05 AM IST
Keerthi Suresh First Look: న్యాయవాదిగా కీర్తి సురేష్… పస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

సారాంశం

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్ కీర్తి సురేష (Keerthi Suresh).  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. ఇక తన సొంత భాష మలయాళంపై దృష్టి పెట్టింది కీర్తి.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్ కీర్తి సురేష (Keerthi Suresh).  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. ఇక తన సొంత భాష మలయాళంపై దృష్టి పెట్టింది కీర్తి.

కీర్తి సురేష్(Keerthi Suresh) పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తోంది. ముచ్చటగా మూడు భాషలను కవర్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఆమె పని అయిపోయింది అనుకున్నట టైమ్ లో  మహేష్ బాబు(Mahesh Babu)  జోడీగా సర్కారువారి పాట సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కీర్తి సురేష్. ఈ సినిమా ఫైనల్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది. ఇక  తమిళంలో విమెన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది కీర్తి. సానికాయిధం అనే టైటిల్ తో తెరకెక్కుతోంది ఈమూవీ  విడుదలకు రెడీ అవుతుంది.

ఇక తన సొంత భాష  మలయాళంపై కీర్తి సురేష్ (Keerthi Suresh) దృష్టి పెట్టింది. అక్కడి ట్రెండ్ కు తగ్గట్ట సినిమాలు ఎంచుకుంటుంది. ఇప్పటికే ఒ సినిమాను కూడా ఆమె  పూర్తిచేసింది. వాశి టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి అప్ డేట్ ను వదిలారు టీమ్. ఈ మూవీలో కీర్తి సురేష్ (Keerthi Suresh) తో పాటు  టోవినో థామస్ లీడ్ రోల్ చేస్తున్నారు.

కీర్తి సురేష్(Keerthi Suresh) ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఫస్టులుక్ ను ఈ సినిమా నుంచి వదిలారు మేకర్స్. ఇద్దరూ కూడా న్యాయవాదులుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. రేవతి కళామందిర్ బ్యానర్ పై సురేశ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహించాడు.

మరక్కార్ తరువాత మలయాళంలో Keerthi Suresh చేసిన సినిమా ఇది. కైలాశ్ మీనన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. డిఫరెంట్ స్టోరీతో .. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో .. ఉత్కంఠగొలిపేలా తీర్చి దిద్దినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు ముఖ్యమైన పాత్రల్లో నందు,బైజు సంతోష్ , అనూ మోహన్ , కృష్ణన్ సోపానం లాంటి మలయాళ స్టార్ కనిపించనున్నారు.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?