ఏమిటా వరసలు..? నెటిజన్ పై యాంకర్ సుమ కామెంట్స్!

Published : Sep 18, 2018, 06:08 PM ISTUpdated : Sep 19, 2018, 02:39 PM IST
ఏమిటా వరసలు..? నెటిజన్ పై యాంకర్ సుమ కామెంట్స్!

సారాంశం

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారానే అభిమానవులతో టచ్ లో ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్ చాట్ లోకి వస్తూ.. ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారు

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారానే అభిమానవులతో టచ్ లో ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్ చాట్ లోకి వస్తూ.. ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారు.

తాజాగా యాంకర్ సుమ అభిమానులతో లైవ్ చాట్ చేశారు. ఇందులో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'అక్క మీరు రాజీవ్ అన్నతో ఓ సినిమా చేస్తే బావుంటుందని' తన కోరికని బయట పెట్టాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా.. 'ఏమిటా వరసలు..? ముందు వరసలు మార్చు.. పిలిస్తే నన్ను వదినా అని పిలవండి, ఆయన్ని అన్నయ్య అని పిలవండి.

లేదంటే నన్ను అక్క అనండి, ఆయన్ని బావ అనండి' అని సూచించారు. రాజీవ్ తో సినిమా చేస్తే చూడాలనుందా..? ఈ విషయం రాజీవ్ ని అడిగా చెప్తా అంటూ వ్యాఖ్యానించింది. ఇక అభిమానులందరికీ త్వరలోనే ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని,. అదేంటో ఇప్పుడే చెప్పనని.. ఈ ఏడాది చివర్లో చెబుతానని వెల్లడించింది. దీంతో ఆమె సినిమాల్లోకి వస్తుందనే ప్రచారం సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ