
తమిళ హీరో కార్తి, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సుల్తాన్`. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.
ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు వెర్షన్స్ రెండూ ఓటీటిలో రిలీజ్ కానున్నాయి. తెలుగు వెర్షన్ రైట్స్ ఆహా తీసుకుంది. మే 2 వ తేదీ నుంచి ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై సదరు ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాని కోసమే అటు కార్తి ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
వంద మంది రౌడీలను మంచివారిగా మార్చడమే ఈ సినిమా.. వారిని మార్చే క్రమంలో వ్యవసాయం చేస్తే ఎవ్వరి దగ్గరా పని చేయాల్సిన అవసరం లేదనే పాయింట్ ఎమోషనల్‌గా కూడా బాగా కనెక్ట్ అయ్యింది. తెలుగులో కార్తీ కెరీర్‌లో ‘సుల్తాన్’ సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మికా మందన్న జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్’. యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ సినిమాని తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను విడుదల చేశారు.