సుక్కుకి వాళ్ళిద్దరితో పనేంటి.. ఒక నిర్మాత, ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్.. ఎన్నో ప్రశ్నలు

Published : Nov 04, 2022, 05:54 PM IST
సుక్కుకి వాళ్ళిద్దరితో పనేంటి.. ఒక నిర్మాత, ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్.. ఎన్నో ప్రశ్నలు

సారాంశం

మాస్టర్ మైండ్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానుంది. పుష్ప మొదటి భాగంతో సుకుమార్ పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరిపోయారు.

మాస్టర్ మైండ్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానుంది. పుష్ప మొదటి భాగంతో సుకుమార్ పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇటీవల కంటెంట్ బావుంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు దుమ్ము లేపుతున్నాయి. 

ఆర్ఆర్ఆర్ తో మొదలు పెడితే కశ్మీర్ ఫైల్స్, పుష్ప, కార్తికేయ 2, కేజీఎఫ్ 2, ఇటీవల వచ్చిన కాంతార చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ సుకుమార్ ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేతులు కలిపారు. 

ఒక పాన్ ఇండియా చిత్రం కోసం వీరు ముగ్గురూ వర్క్ చేయనున్నారు. ముగ్గురూ కలసి ఉన్న పిక్ కూడా బయటికి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు గురించి కంప్లీట్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. దీనితో అభిమానుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు.. సుకుమార్ రచయిత గా ఉంటారా ఇలా చాలా సందేహాలు మొదలయ్యాయి. 

నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్తికేయ 2, కశ్మీర్ ఫైల్స్ చిత్రాలని నిర్మించి పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం అందుకున్నారు.సుకుమార్ , వివేక్ కాంబినేషన్ లో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండియా మొత్తం సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించే అంశమే ఇది. 

PREV
click me!

Recommended Stories

రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..
OTT: జీవితానికి రీసెట్ బటన్ ఉండదు.. ఈ తరం వారి కళ్లు తెరిపించే సినిమా. ఓటీటీలో స్ట్రీమింగ్