
అక్టోబర్ 5న దసరా కానుకగా థియేటర్స్ లో దిగిన ది ఘోస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ది ఘోస్ట్ చిత్రానికి కనీస వసూళ్లు దక్కలేదు. క్రిటిక్స్ మంచి రేటింగ్ ఇచ్చినా ప్రేక్షకులు నాగార్జున చిత్రాన్ని పట్టించుకోలేదు. సోలోగా నాగార్జున హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం తర్వాత ఆయనకు హిట్ దక్కలేదు.
ది ఘోస్ట్ ప్రోమోలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల్లో అధిక భాగం చిత్రీకరణ జరిపారు. ది ఘోస్ట్ ఫలితం నాగార్జునను నిరాశపరిచింది. అయితే ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుంది. అక్టోబర్ 2 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ది ఘోస్ట్ టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది. నెట్ఫ్లిక్స్ లో ది హోస్ట్ టాప్ వన్ లో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ చిత్రానికి డైరెక్టర్ గా వ్యవహరించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించారు. ది ఘోస్ట్ మూవీలో నాగార్జున ఇంటర్పోల్ ఆఫీసర్ రోల్ చేశారు. గరుడవేగ ఫేమ్ యాక్షన్ మూవీకి ఎమోషనల్ అంశాలు జోడించి తెరకెక్కించారు. మరి చూడాలి ది ఘోస్ట్ నెట్ఫ్లిక్స్ లో ఇంకెన్ని సంచలనాలు చేయనుందో..