మహేష్ ని కలిసిన సుకుమార్.. ఏం జరుగుతోంది..?

Published : Mar 10, 2019, 04:12 PM IST
మహేష్ ని కలిసిన సుకుమార్.. ఏం జరుగుతోంది..?

సారాంశం

మహేష్ బాబు సినిమా క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు దర్శకుడు సుకుమార్. దానికి కారణం మహేష్.. అనీల్ రావిపూడి సినిమాతో పాటు సుకుమార్ సినిమా కూడా చేస్తానని చెప్పడమే అని సమాచారం. 

సుకుమార్ ఈగో హర్ట్ అవ్వడంతో మహేష్ తో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడట. దీంతో మహేష్ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా చేయడం కుదరడం లేదని చెప్పాడు.అయితే తెర వెనుక దీనికి సంబంధించిన కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని టాక్.

మహేష్ తో తన రిలేషన్ ని కాపాడుకోవడం కోసం సుకుమార్ ప్రత్యేకంగా మహేష్ ని కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుండగా.. సుకుమార్ అక్కడకి వెళ్లి మహేష్ ని కలుసుకున్నారట.

బన్నీతో సినిమా చేయడానికి గల కారణాలను వివరించి.. మహేష్ మనసు నొచ్చుకున్నందుకు క్షమాపణలు కూడా కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని మరింత ముదరకుండా ఉండడానికే సుకుమార్.. మహేష్ కి సారీ చెప్పేశాడని అంటున్నారు.  
 
PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్