మీకోసమే ఇలాంటి బట్టలు.. జాన్వీ కపూర్ కామెంట్స్!

Published : Mar 10, 2019, 03:50 PM IST
మీకోసమే ఇలాంటి బట్టలు.. జాన్వీ కపూర్ కామెంట్స్!

సారాంశం

దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ లో జాన్వీకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. 

దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు బాలీవుడ్ లో జాన్వీకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్తున్నా.. మీడియా ఆమెని ఫాలో అవుతూనే ఉంటుంది.

ఇటీవల జాన్వీ కపూర్ జిమ్ కి వెళ్తున్న సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  జాన్వీ జిమ్ వద్దకి రాగానే ఫోటోగ్రాఫర్లు కెమెరాలు క్లిక్ మనిపించడం మొదలుపెట్టారు.

జాన్వీని ఫోజులు ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి ఆమె ఫన్నీగా.. ''నేను జిమ్ కంటే మీకోసమే ఎక్కువ రెడీ కావాల్సి వస్తోంది. మీ కోసమే ఈ బట్టలు వేసుకొని వస్తున్నా'' అని సరదాగా కామెంట్ చేస్తూ వెళ్లిపోయింది.

గతంలో కరీనా కపూర్ కూడా ఇలానే స్పందించింది. ప్రతీరోజూ జిమ్ కి కొత్త డ్రెస్ వేసుకోవాల్సి వస్తోందని.. ఎలాంటి డ్రెస్ లు వేసుకున్నా ఫోటోగ్రాఫర్లు మాత్రం ఫోటోలు తీస్తూనే ఉంటారని చెప్పింది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!