Chiranjeevi-Sukumar: చిరంజీవిని డైరెక్ట్ చేసిన సుకుమార్..!

Published : Apr 01, 2022, 01:55 PM IST
Chiranjeevi-Sukumar: చిరంజీవిని డైరెక్ట్ చేసిన సుకుమార్..!

సారాంశం

అల్లు అర్జున్ పుష్ప2 కంప్లీట్ కాకుండానే చిరంజీవిపై క్లాప్ కొట్టాడు సుకుమార్. మెగాస్టార్ ని డైరెక్ట్ చేయడం అనేక మంది స్టార్ డైరెక్టర్స్ కలగా ఉండగా... సుకుమార్ ఛాన్స్ దక్కించుకున్నాడు.   

స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్(Sukumar) వరుస హిట్స్ తో దుమ్మురేపుతున్నారు. ఆయన రీసెంట్ చిత్రాలు నాన్నకు ప్రేమతో, రంగస్థలం భారీ హిట్స్ కొట్టాయి. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించారు. శుభగ్రహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ట్విట్టర్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిలిం కోసం ఆయన దర్శకత్వంలో షూటింగ్‌ను తాను చాలా ఎంజాయ్ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగ్రహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో విడుదలై రంగస్థలం సినిమా ఇటీవలే నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.హీరో రామ్ చరణ్ కి ఈ సినిమా భారీ బ్రేక్ ఇచ్చింది. నటుడిగా రామ్ చరణ్ ని నిలబెట్టిన చిత్రంగా రంగస్థలం నిలిచిపోయింది. 

మరోవైపు చిరంజీవి వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఏక కాలంలో మూడు చిత్రాలు షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్న గాడ్ ఫాదర్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళా శంకర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 కూడా సెట్స్ పై ఉంది. వీటితో పాటు వెంకీ కుడుమలతో ఓ మూవీ ఓకె చేశారు. 

కాగా ఈ నెలలో ఆచార్య విడుదలకు సిద్ధం అవుతుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీలో రామ్ చరణ్ కీలక రోల్ చేస్తున్నారు. చిరంజీవి, చరణ్ కలిసి చేస్తున్న పూర్తి స్థాయి మల్టీస్టారర్ గా ఆచార్య రికార్డులకు ఎక్కింది. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి