
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన ఫ్యామిలీ విషాదంలోకి వెళ్లింది. దర్శకుడు శరత్ తెలుగులో పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇరవైకిపైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
`డియర్` అనే నవల ఆధారంగా `చాదస్తపు మొగుడు` అనేసినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా శరత్ పరిచయం అయ్యారు. ఏఎన్నార్, బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి విజయాలను అందుకున్నారు. ఏఎన్నార్‌తో `కాలేజీ బుల్లోడు`, జగపతిబాబుతో `భలే బుల్లోడు`, బాలకృష్ణతో `వంశానికొక్కడు`, `పెద్దన్నయ్య`, `సుల్తాన్` వంటి సూపర్ హిట్ సినిమాలను రూపొందించారు. అలాగే సుమన్‌తో `చాదస్తపు మొగుడు`, `పెద్దింటి అల్లుడు`, `బావ బావమరిది`, `చిన్నల్లుడు` వంటి సినిమాలను రూపొందించారు. ఇదిలా ఉంటే శరత్ మ్యారేజ్ చేసుకోలేదు.
దర్శకుడు శరత్ మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మృతి టాలీవుడ్‌కి తీరని లోటని వెల్లడిస్తున్నారు.
.