చిరంజీవి కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన మరో తమిళ సినిమాని ఓకే చేసినట్లు సమాచారం. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ చిరంజీవికి బాగా నచ్చిందిట. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన నెక్ట్స్ సినిమా కోసం మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న'లూసిఫర్'ను ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పనులు పనులు పూర్తై షూటింగ్ కు రెడీగా ఉన్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. పూర్తి పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరక్ట్ చేయనున్నారు. అయితే ఆల్రెడీ సినిమా తెలుగు డబ్బింగ్ అయ్యి,రిలీజ్ అయ్యింది. కాకపోతే ఇక్కడ ఆడలేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు.
ఇక చిరంజీవి కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన మరో తమిళ సినిమాని ఓకే చేసినట్లు సమాచారం. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ చిరంజీవికి బాగా నచ్చిందిట. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించారు. ఇప్పుడు సాహో దర్శకుడు సుజీత్ చేత తెలుగులో ఈ చిత్రం చేయనున్నట్లు తెలుస్తుంది. చిరంజీవికి త్వరలో మార్పులతో తెలుగు వెర్షన్ నేరేషన్ ఇచ్చేందుకు స్క్రిప్టు పని చేస్తున్నట్లు సమాచారం. ఎన్నై అరిందాల్ చిత్రంలో అజిత్, త్రిష, అనుష్క ముఖ్య పాత్రలు పోషించారు.
సాహో ఫెయిలైన వెంటనే, దర్శకుడు సుజీత్ కెరీర్ ముగిసిందని అందరూ భావించారు. కానీ, ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి దృష్టిని ఆకర్షించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదట్లో మలయాళ హిట్ లూసిఫెర్ రీమేక్ దర్శకత్వం వహించడానికి సుజీత్ ఫ్రంట్ లైన్ లో ఉన్నట్లు మొదట వార్త వచ్చింది. అయితే, సుజీత్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయాడు. కానీ, మెగాస్టార్ కోసం సుజీత్ ఈ తమిళ రీమేక్ కోసం పని చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.