‘సాహో’ సుజీత్ ఆ హీరోకు కథ చెప్పాడు..ఏమైంది?

By Surya Prakash  |  First Published Dec 21, 2020, 11:43 AM IST

30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమాను హ్యాండిల్ చేసాడు సుజీత్ అని ఇండస్ట్రీ మెచ్చుకుంది. అయితే అదే ముప్పు తెచ్చిపెట్టింది. సుజీత్ మామూలు సినిమాలు ఓకే చెయ్యలేడు. అలాగని సాహో దెబ్బతో పెద్ద సినిమాలు ఓకే కావు. అయినా ప్రయత్నాలు మానరు కదా. ఇప్పుడు సుజీత్ అదే చేస్తున్నారు. 


డైరక్టర్ సుజీత్  ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు . ప్రభాస్ తో చేసిన సాహో సినిమాతో ఈయన దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయాడు. ఈ సినిమా ఆడిందా..డబ్బులు వచ్చాయా అనే సంగతి పక్కన బెడితే సుజీత్ కు గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టింది. 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమాను హ్యాండిల్ చేసాడు సుజీత్ అని ఇండస్ట్రీ మెచ్చుకుంది. అయితే అదే ముప్పు తెచ్చిపెట్టింది. సుజీత్ మామూలు సినిమాలు ఓకే చెయ్యలేడు. అలాగని సాహో దెబ్బతో పెద్ద సినిమాలు ఓకే కావు. అయినా ప్రయత్నాలు మానరు కదా. ఇప్పుడు సుజీత్ అదే చేస్తున్నారు. 

మొన్నటిదాకా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చెయ్యబోయే లూసీఫర్ రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ స్క్రిప్టుపైనా కొంతకాలం పనిచేసారు. ఆ తర్వాత  వివాహం..ఆ సినిమా నుంచి తప్పుకోవటం జరిగాయి. చిరంజీవి కూడా అఫీషియల్ గా వేరే దర్శకుడుని ప్రకటించారు. గోపీచంద్ తోనూ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే అదీ మెటీరియలైజ్ కాలేదని సమాచారం. దాంతో శర్వా వైపే మళ్లీ మ్రొగ్గు చూపారట సుజీత్. అయితే శర్వా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో  తెలుగులో ఎలాగూ స్టార్స్ దొరకటం లేదని హిందీ వైపు కన్నేసినట్లు సమాచారం.
  
ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్ద సహాయంతో ముంబై వెళ్లి ఓ యంగ్ హీరోకు కథ వినిపించి వచ్చారట సుజీత్. ఆ హీరో మరెవరో కాదు విక్కీ కౌశల్. బాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రయత్నం చేసిందని వినికిడి. అందుకు రన్ రాజా రన్ రీమేక్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే విక్కీ కౌశల్ ఈ స్క్రిప్టు విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో మాత్రం తెలియదు. 
 

Latest Videos

click me!