టైటిల్ మార్చిన సందీప్ వంగ..కారణం `కిక్` సినిమా

By Surya Prakash  |  First Published Dec 21, 2020, 9:44 AM IST

రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న క్రైమ్ డ్రామా కు సందీప్ తన టైటిల్ ని మార్చినట్లు సమాచారం. డెవిల్ టైటిల్ కన్నా డెవిలిష్ గా ఉండేందుకు ఆలోచించి...ఓ వైల్డ్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఆ టైటిలే ..‘Animal’ (యానిమల్). చాలా క్రూడ్ గా చిత్రం ఉంటుందని, అందుకే ఈ టైటిల్ ని పెట్టారని సమాచారం. 2021 సగం నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. 


టైటిల్ తోనే సినిమా సగం సక్సెస్ సాధిస్తుందని చాలా సార్లు ప్రూవైంది. టైటిల్ సినిమాను ఏ కోణంలో చూడాలి అనేది నిర్ణయిస్తుంది. ఎక్సపెక్టేషన్స్ పెంచుతుంది. అలాగే అంచనాలను అణగకొట్టేస్తుంది. కాబట్టే సినిమావాళ్లు టైటిల్ విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తూంటారు. అర్జున్ రెడ్డి చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానం క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన తన తదుపరి చిత్రం కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ డెవిల్ అనే బయిటకు వచ్చింది. అయితే తాజాగా సందీప్ వంగా టైటిల్ ని మార్చినట్లు తెలుస్తోంది.

రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న క్రైమ్ డ్రామా కు సందీప్ తన టైటిల్ ని మార్చినట్లు సమాచారం. డెవిల్ టైటిల్ కన్నా డెవిలిష్ గా ఉండేందుకు ఆలోచించి...ఓ వైల్డ్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఆ టైటిలే ..‘Animal’ (యానిమల్). చాలా క్రూడ్ గా చిత్రం ఉంటుందని, అందుకే ఈ టైటిల్ ని పెట్టారని సమాచారం. 2021 సగం నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. 

Latest Videos

అయితే టైటిల్ మార్చడానికి కారణం.. సల్మాన్ అని తెలిసింది. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు డెవిల్ టైటిల్ ని సాజిద్ నాడియాద్ వాలా రిజిస్టర్  చేయించారట. దీంతో టైటిల్ మార్చాలని సందీప్ వంగా అండ్ మేకర్స్ నిర్ణయించారు.  సల్మాన్ నటిస్తున్న `కిక్`  సీక్వెల్ కి డెవిల్ టైటిల్ ని  ఉపయోగించాలనే ఆలోచనతో ఉన్నారు సాజిద్. సల్మాన్ ఖాన్ నటించిన మొదటి భాగంలో హీరో తన అప్రమత్తమైన కార్యకలాపాలను చేపట్టేటప్పుడు `డెవిల్` అనే మారుపేరును ఉపయోగించాడు. దానివల్ల డెవిల్ అన్న పేరు బాగా రిజిస్టర్ అయిపోయింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ తో.. సాజిద్ నాడియాద్వాలా డెవిల్ టైటిల్ తో ముందుకు వెళ్తున్నారు. 

ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయం కూడా సాధించింది.  ప్రేమకథను ఇంత బోల్డుగా చూపించొచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక అర్జున్‌ రెడ్డికి ఫిదా అయిన బాలీవుడ్‌.. సందీప్‌రెడ్డిని అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి కనక వర్షాన్ని కురిపించాడు.

click me!