'సుడిగాలి' సుధీర్ కొత్త చిత్రం టైటిల్ , తేడా కొడితే అలాగే పిలుస్తారు మరి

Published : May 20, 2023, 11:40 AM IST
  'సుడిగాలి' సుధీర్ కొత్త చిత్రం టైటిల్ , తేడా కొడితే అలాగే పిలుస్తారు మరి

సారాంశం

లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ పై సుడిగాలి సుధీర్ ,దివ్య భారతి హీరోహీరోయిన్లుగా పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో  చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టైటిల్  ఫిక్సైంది.


సుడిగాలి సుధీర్ కొత్త చిత్రానికి ఇంట్రస్టింగ్  టైటిల్ ను ఫిక్స్ చేసారు. గాలోడు చిత్రంతో హిట్ కొట్టిన సుడిగాలి సుధీర్ వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. .తాజాగా మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ లో పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సుధీర్ కు నాల్గో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి ‘GOAT – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనే టైటిల్ పెట్టారు.ఈ మూవీతో తమిళ్ బ్యూటీ దివ్య భారతి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది

చిత్ర నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ... మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రోజు సుడిగాలి సుధీర్ బర్త్ డే రోజున మా "GOAT" సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాండ్ రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు తగ్గట్టే లియో మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.

దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ... ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా షూటింగ్ విషయంలో మాకు ఏది కావాలన్నా బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు.లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు.మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

  ఈ చిత్రానికి కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం, సంగీతం: లియొన్‌ జేమ్స్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, నిర్మాతలు: చంద్రశేఖర్‌ రెడ్డి బెక్కెం వేణుగోపాల్‌, నిర్మాణ సంస్థ: లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్‌, దర్శకత్వం: నరేష్‌ కుప్పిలి. 

PREV
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?