RGV నన్ను నమ్మించి మోసం చేశాడు.. బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పేయ్ సంచలన వ్యాఖ్యలు

Published : May 20, 2023, 10:40 AM IST
RGV నన్ను నమ్మించి మోసం చేశాడు.. బాలీవుడ్ స్టార్  మనోజ్ బాజ్‌పేయ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

రామ్ గోపాల్ వర్మ తనను మోసం చేశాడంటున్నాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్ పేయ్.. తనను హీరోను చేస్తానని మోసం చేశాడంటూ..సంచలన వ్యాఖ్యలు చేశాడు మనోజ్.   

బాలీవుడ్  స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ఎంతో కాలంగా బాలీవుడ్ తో పాటు సౌత్ ఆడియన్స్ ను కూడా అలరిస్తూ వస్తున్నాడు. నిజానికి మనోజ్ ను నటుడిని చేసింది రామ్ గోపాల్ వర్మనే. మనోజ్ బాజ్ పేయ్..  హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి అభిమానుల మెప్పుని  సంపాదించుకున్నాడు.  మంచి మంచి సినిమాలతో  బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగాడు. ఇక కాస్త గ్యాప్ తరువాత ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ లో రెచ్చిపోతున్నాడు మనోజ్. 

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ దడదడలాడిస్తున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు మనోజ్ బాజ్ పేయ్.  ఇక ప్రస్తుతం మాటర్ ఏంటంటే.. ఆర్జీవీపై మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ హిందీలో సినిమాలు చేస్తే.. మనోజ్ బాజ్ పేయ్ పక్కగా ఉండేవాడు. అంత అనుబంధం ఉంది వారి మధ్య. అసలుమనోజ్ నునటుడిగా నిలబెట్టింది రామ్ గోపాల్ వర్మనే. 

తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ రామ్ గోపాల్ వర్మ గురించి.. అతను నటిచిన  సత్య సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చేశాడు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ తనను హీరోని చేస్తానని చెప్పి మోసం చేశాడంటూ కామెంట్ం చేశాడు.  దౌడ్ సినిమాలో ఓ నటుడి కోసం వెతుకుతున్నారంటే వెళ్ళాను.. అప్పుడే  మొదటిసారి RGVని కలిశాను. నేను బాండిట్ క్వీన్ లో మాన్ సింగ్ పాత్ర చేశాను అని చెప్పడంతో, ఇన్నాళ్లు నీ గురించే వెతుకుతున్నాను, ఆ సినిమా చాలా సార్లు చూశాను, ఆ పాత్ర నాకు బాగా నచ్చిందని మెచ్చుకున్నారట ఆర్జీవీ.

అంతే కాదు  నీకు దౌడ్ సినిమాలో పాత్ర ఏదు.. తీసుకోవద్దు..  నీ కోసమే నెక్ట్స్  ఓ స్క్రిప్ట్ రాశాను, అందులో నువ్వే హీరోగా చేద్దువుగాని.. అని చెప్పి పంపించారట. ఇక ఆతరువాత  సత్య సినిమా కోసం పోన్ వస్తే.. మళ్ళీ వెళ్లి  వర్మను కలిశాను. కానీ అందులో రెండో పాత్ర కోసం నన్ను తీసుకుంటున్నాని చెప్తే నేను చాలా బాధపడ్డాను అని అన్నారు మనోజ్. అయితే బాధపడి ఊరుకోకుండా ఆర్జీవీని అడిగేశారట మనోజ్. 

నన్ను మెయిన్ లీడ్ అన్నారు కదా.. ఇప్పుడేటేంటి ఇది  అని అడిగితే, భికూ మాత్రే పాత్ర గురించి నాకు చెప్పి ఓకే చెప్పేలా చేశారు. లీడ్ క్యారెక్టర్ లో ఎవరైనా చేయగలరు, కానీ భికూ మాత్రే నీకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు. అప్పుడు మొదట బాధపడ్డా, సినిమా రిలీజ్ అయ్యాక భికూ మాత్రే పాత్రకు వచ్చిన స్పందన చూసి సంతోషం వేసింది అని అన్నారు మనోజ్ బాజ్ పేయ్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?