సుడిగాలి సుధీర్‌కి కరోనా.. రష్మీ టెన్షన్‌ టెన్షన్‌?

Published : Oct 21, 2020, 09:47 AM IST
సుడిగాలి సుధీర్‌కి కరోనా.. రష్మీ టెన్షన్‌ టెన్షన్‌?

సారాంశం

దసరా కో్సం రష్మి వంటి ఇతర సెలబ్రిటీలు, ఆర్టిస్టులతో కలిసి `అక్కా ఎవడే అతగాడు` అనే ఓ స్పెషల్‌ షోలో పాల్గొంటున్నాడు సుధీర్‌. ఇందులో సుధీర్‌తోపాటు ఆయన ప్రియురాలు రష్మీ గౌతమ్‌, యాంకర్లు, జడ్జ్ లు వర్షిణి, శేఖర్‌ మాస్టర్, నటి సంగీత వంటి వారు పాల్గొన్నారు. 

`జబర్దస్త్` ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ కరోనాకి గురైనట్టు తెలుస్తుంది. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో అనుమానంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలిందట. తాజాగా ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సుధీర్‌ హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

లాక్‌ డౌన్‌ ఎత్తేయడం, షూటింగ్‌లకు అనుమతివ్వడంతో టీవీ షూటింగ్‌లు షురూ అయ్యాయి. చాలా రోజులుగా టెలివిజన్‌ షోస్‌ చిత్రీకరణలు జరుగుతూనే ఉన్నాయి. సుధీర్‌ కూడా వాటిలో పాల్గొంటున్నాడు. ఆయన దసరా కో్సం రష్మి వంటి ఇతర సెలబ్రిటీలు, ఆర్టిస్టులతో కలిసి `అక్కా ఎవడే అతగాడు` అనే ఓ స్పెషల్‌ షోలో పాల్గొంటున్నాడు. ఇందులో సుధీర్‌తోపాటు ఆయన ప్రియురాలు రష్మీ గౌతమ్‌, యాంకర్లు, జడ్జ్ లు వర్షిణి, శేఖర్‌ మాస్టర్, నటి సంగీత వంటి వారు పాల్గొన్నారు. ఈ షో దసరా సందర్భంగా ఈ నెల 25న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

అయితే ఇలాంటి షోస్‌లో సుధీర్‌ పాల్గొనడంతో ఇప్పుడు వారంతా టెన్షన్‌ పడుతున్నారని సమాచారం. సుధీర్‌కి వచ్చిందన వార్త తెలిసి ఆందోళన చెందుతున్నారట. వారంతా హోం క్వారంటైన్‌ అయినట్టు టాక్‌. ముఖ్యంగా సుధీర్‌, రష్మీ మధ్య ఏదో ఉందనే ప్రచారంసోషల్‌ మీడియాలో జరుగుతుంది. వీరిద్దరు కలిసి చాలా రోజులుగా డేటింగ్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజా వార్తతో రష్మీ బాగా టెన్షన్‌ పడుతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది అధికారిక ప్రకటనగానీ, ఎవరైనా స్పందిస్తేగానీ తెలుస్తుంది.

సుధీర్‌ ప్రస్తుతం `ఢీ ఛాంపియన్స్` రియాలిటీ షోతో పాటు, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో హీరో ఫ్రెండ్‌గా నటిస్తున్నారు. గతేడాది `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`తో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. `త్రీమంకీస్‌`లోనూ హీరోగా మెప్పించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు