మరోసారి తండ్రి అయిన హీరో కార్తి..బ్లెస్సింగ్స్ కావాలట!

Published : Oct 21, 2020, 09:09 AM IST
మరోసారి తండ్రి అయిన హీరో కార్తి..బ్లెస్సింగ్స్ కావాలట!

సారాంశం

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య సోదరుడు, హీరో కార్తి మరోసారి తండ్రి అయ్యాడు. ఆయనకు మంగళవారం సాయంత్రం పండంటి మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని కార్తి సోషల్‌ మీడియా అకౌంట్‌ అయిన ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. 

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య సోదరుడు, హీరో కార్తి మరోసారి తండ్రి అయ్యాడు. ఆయనకు మంగళవారం సాయంత్రం పండంటి మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని కార్తి సోషల్‌ మీడియా అకౌంట్‌ అయిన ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. ఈ లైఫ్‌ ఛాలెంజింగ్‌ ప్రాసెస్‌లో సహకరించిన వైద్యులు, నర్సులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తన మగబిడ్డకు అందరు ఆశిస్సులు కావాలని కోరుకున్నాడు. 

కార్తికి రంజనితో 2011లో వివాహం జరిగింది. 2013లో వీరికి కూతురు ఉమయాల్‌ జన్మించారు. ఏడేళ్ళ తర్వాత మరో సారి కార్తి తండ్రి అయ్యారు. ఇక నటుడు శివకుమార్‌ కుమారిడిగా, సూర్య సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేసిన కార్తి మణిరత్నం దర్శకత్వం వహించిన `ఆయుత ఎజుతు`(తెలుగులో యువ) చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు కార్తి. 

2007లో `పరుథివీరన్‌` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది తెలుగు `మల్లీగాడు`గా విడుదలైంది. ఆ తర్వాత `ఆయిరథిల్‌ ఒరువన్‌` చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇది తెలుగులో `యుగానికి ఒక్కడు`గా విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్‌ హీరోగా రాణిస్తున్న కార్తి `సుల్తాన్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?