శ్రీదేవి సోడా సెంటర్‌ పెట్టుకున్న మహేష్‌ బావ

By Aithagoni RajuFirst Published 30, Oct 2020, 7:56 PM
Highlights

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బావ, హీరో సుధీర్‌బాబు సోడా సెంటర్‌ పెట్టుకున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి పేరుతో ఆయన సోడా సెంటర్‌ పెట్టుకోవడం ఇప్పుడు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే. 

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బావ, హీరో సుధీర్‌బాబు సోడా సెంటర్‌ పెట్టుకున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి పేరుతో ఆయన సోడా సెంటర్‌ పెట్టుకోవడం ఇప్పుడు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే. 

హీరో సుధీర్‌బాబు `శ్రీదేవి సోడా సెంటర్‌` పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ఓ టెంపుల్‌ వద్ద జరిగే జాతరలో కలర్‌ లైట్స్ అమరుస్తున్నాడు. `శ్రీదేవి సోడా సెంటర్‌` వద్దకు వచ్చిచేతిలో సోడాతో కనిపిస్తున్నాడు.  ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

దీన్ని బట్టి సుధీర్‌బాబు జాతరలో, ఫంక్షన్‌లో డెకరేషన్‌, లైట్స్ అమర్చే వ్యక్తిగా కనిపిస్తారని అర్థమవుతుంది. లైటింగ్‌ సూరిబాబుగా సుధీర్‌బాబు కనిపించనున్నారు. ఈ సినిమాని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కరుణ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో సుధీర్‌బాబు `భలే మంచి రోజు` సినిమాలో నటించారు. అయితే కరుణ కుమార్‌ ఇటీవల `పలాస 1978`తో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 30, Oct 2020, 7:56 PM