యాక్షన్‌ హీరో డైరెక్షన్‌లో చైతూ కొత్త సినిమా..?

Published : Oct 30, 2020, 05:09 PM IST
యాక్షన్‌ హీరో డైరెక్షన్‌లో చైతూ కొత్త సినిమా..?

సారాంశం

విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతూ. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా మరో సినిమాకి చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

యువ సామ్రాట్‌ నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన `లవ్‌ స్టోరి` విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. శేఖర్‌ కమ్ముల మార్క్ కూల్‌ లవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుంది. 

దీంతోపాటు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతూ. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా మరో సినిమాకి చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. సీరియర్‌ హీరో అర్జున్‌ సార్జా దర్శకత్వంలో ఓ సినిమాకి చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

అర్జున్‌ యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశభక్తిగల చిత్రాలకు ఆయన ఫేమస్‌. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా, విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల చైతూకి ఓ కథని నెరేట్‌ చేయగా, ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. అర్జున్‌ తరహాలోనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. మరి ఇది వర్కౌట్‌ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?