మహేష్‌తో అలాంటి సినిమా చేస్తాః సుధీర్‌బాబు.. రొమాంటిక్‌ మూవీస్‌పై బోల్డ్ కామెంట్‌..

Published : Jan 24, 2023, 07:07 PM IST
మహేష్‌తో అలాంటి సినిమా చేస్తాః సుధీర్‌బాబు..  రొమాంటిక్‌ మూవీస్‌పై బోల్డ్ కామెంట్‌..

సారాంశం

మహేష్‌బాబుతో సినిమా చేయడంపై రియాక్ట్ అయ్యారు హీరో సుధీర్‌బాబు. అంతేకాదు రొమాంటిక్‌ మూవీస్‌పై ఆయన ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. `హంట్‌` మూవీలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లని పంచుకున్నారు. 

యంగ్‌ హీరో, నైట్రో స్టార్‌ సుధీర్‌బాబు రొమాంటిక్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫ్యూర్‌ రొమాంటిక్‌ సినిమాలను ఆడియెన్స్ చూడటం లేదన్నారు. ఏదో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు, గూస్‌ బంమ్స్ మూవ్‌మెంట్స్ ఉంటేనే ఆడియెన్స్ సినిమాలను ఆదరిస్తున్నారని, ప్లెయిన్‌గా, కూల్‌గా సాగే చిత్రాలను ఎంకరేజ్‌ చేయడం లేదన్నారు. తన గత చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఆడకపోవడానికి కారణం అదే అని తెలిపారు. 

ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్‌, గ్లామర్‌ ఎలిమెంట్లు లేకున్నా ఫర్వాలేదని, కానీ రెండు మూడు థ్రిల్లింగ్‌ హై మూవ్‌మెంట్స్ ని ఆడియెన్స్ కోరుకుంటున్నారని తెలిపారు. `కాంతార` చిత్రం హిట్‌కి అదే కారణమన్నారు. ఎంగేజింగ్‌గా స్క్రీన్‌ప్లే ఉంటే, అదిరిపోయేలా యాక్షన్‌, కట్టిపడేసే ఎమోషన్స్ ఉంటే గ్లామర్‌ని ఆడియెన్స్ కోరుకోవడం లేదన్నారు సుధీర్‌బాబు. తన `హంట్‌` సినిమాలో అలాంటి థ్రిల్లింగ్‌, హై మూవ్‌మెంట్స్ ఉంటాయన్నారు. ఈ సినిమా ఎంచుకోవడానికి కూడా కారణం అదే అన్నారు. చాలా చోట్ల గూస్‌ బంమ్స్ మూవ్‌మెంట్స్ ఉంటాయని, ఏ హీరో చేయని సాహసం  ఈ సినిమా కోసం చేశానని తెలిపారు. 

సుధీర్‌బాబు హీరోగా మహేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన `హంట్‌` చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. శ్రీకాంత్‌, `ప్రేమిస్తే` భరత్‌ కీలక పాత్రలు పోషించారు.  ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మంగళవారం మీడియాతో ముచ్చటించారు. సినిమా ట్రెండ్‌ని ఆయన బోల్డ్ కామెంట్స్ చేశారు. తాను ఇందులో మెమరీ లాస్‌ అయిన పోలీస్‌ అధికారిగా నటించారట. అర్జున్ ఏ, అర్జున్‌ బీ ఇలా రెండు షేడ్స్ లో తన పాత్ర ఉంటుందన్నారు. ఫ్రెండ్‌షిప్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని చెప్పారు. 

మరోవైపు సినిమాకి హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు పనిచేయడంపై సుధీర్‌బాబు మాట్లాడుతూ, `నేను ఓ యాక్షన్ సినిమా చేస్తే వాళ్ళ(ఫారిన్‌) దగ్గరకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని అనుకున్నా. ఆ తర్వాత వాళ్ళు సినిమాలకు పని చేస్తారని తెలిసింది. ఎవరెవరు ఏయే సినిమాలకు పని చేశారో తెలియదు. రెండు నెలలు మాట్లాడాం. ముందు ఒక్కటే యాక్షన్ సీక్వెన్సు అనుకున్నారు. మేం నాలుగు అని చెబితే 12 రోజులు పడుతుందని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అప్రోచ్ అవుతారని, చివరకు చేయరని, పేమెంట్స్ ఫస్ట్ ఇవ్వాలని చెప్పారు. మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాత మేం ఫారిన్ వెళ్ళాం. మా కోసం వాళ్ళు డేట్స్ బ్లాక్ చేశారు. నాలుగు రోజుల్లో షూట్ చేశాం అన్ని యాక్షన్ సీక్వెన్సులు. ఇక్కడ ఎవరికైనా చూపించి నాలుగు రోజుల్లో చేశామంటే నమ్మరు. రెండు రోజులు రిహార్సిల్స్ చేశామంతే. అదే ఇక్కడ చేస్తే 25 రోజులు పట్టేవ`ని తెలిపారు సుధీర్‌బాబు. 

ఇక తాను చేయబోయే సినిమాల గురించి చెబుతూ, నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో 'మామా మశ్చీంద్ర' అని ఓ సినిమా చేస్తున్నాను. ఇది కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా. ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాను. యువి క్రియేషన్స్ లో ఇంకో సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా అది. రెండు మూడు రోజుల్లో టైటిల్ అనౌన్స్ చేస్తారు. అలాగే పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ ఇంకా చర్చల దశలోనే ఉందని, దీన్ని రెండు పార్ట్ లుగా తీసే ఆలోచన ఉందని, కాకపోతే చాలా టైమ్ పడుతుందన్నారు సుధీర్‌బాబు. బావ మహేష్‌తో కలిసి నటించడంపై స్పందిస్తూ.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ ఓ అంతర్జాతీయ అడ్వెంచర్‌ ఫిల్మ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అలాంటి చిత్రంలో అవకాశం వస్తే నటిస్తానని తెలిపారు సుధీర్‌బాబు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?