Latest Videos

సమంతని పెళ్ళికి ఇన్వైట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ పోస్ట్

By tirumala ANFirst Published Jun 13, 2024, 10:20 PM IST
Highlights

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెని వరిస్తున్నాయి. 

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ రోల్స్ తో అదరగొడుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఆమెని వరిస్తున్నాయి. రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ పాన్ ఇండియా సంచలనం హనుమాన్ చిత్రంలో హీరో సోదరి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ వైవాహిక బంధంలో తొలి అడుగు వేసింది. ఇటీవల ఆమె నిశ్చితార్థం తన ప్రియుడితో జరిగింది. ముంబైకి చెందిన నిక్కోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో చాలా కాలంగా వరలక్ష్మి ప్రేమలో ఉంది. అంతే కాదు వీళ్లిద్దరి మధ్య 14 ఏళ్ళ నుంచి స్నేహం ఉందట. 

అయితే ఇప్పుడు వీరిద్దరి పెళ్ళికి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 2న వరలక్ష్మి వివాహం థాయ్ ల్యాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. దీనితో వరలక్ష్మి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అతిథుల్ని ఆహ్వానిస్తోంది. ఆల్రెడీ రవితేజ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, లాంటి వారిని ఇన్వైట్ చేసింది. 

తాజాగా సమంతని కూడా వరలక్ష్మి శుభలేఖ ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించింది.దీనితో సమంత కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సమంత యశోద చిత్రంలో వరలక్ష్మి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.  2012లో శింబు సరసన పోడాపోడి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆచిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు. దీనితో హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోవడం వరలక్ష్మికి కష్టంగా మారిందట.

click me!