సుధీర్ బాబు 'హరోం హర' ఏ OTT లో , ఎప్పటినుంచి...

By Surya PrakashFirst Published Jul 7, 2024, 10:11 AM IST
Highlights

 ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇంతకీ ఏ ఓటిటి సంస్ద ఈ రైట్స్ తీసుకుంది. 

సుధీర్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ హరోం హర. కొత్త దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించారు. సునీల్, జయప్రకాష్ కీ రోల్స్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మంచి ఓపినింగ్స్ వచ్చాయి. ఓ సారి చూడచ్చు అనే టాక్ తెచ్చుకుంది. కానీ భాక్సాఫీస్ దగ్గర విన్నర్ కాలేకపోయింది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇంతకీ ఏ ఓటిటి సంస్ద ఈ రైట్స్ తీసుకుంది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది డిటేల్స్ చూద్దాం.
 
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ETV నెట్ వర్క్ వారు డిజిటల్, శాటిలైట్ రైట్స్ క్లోజ్ చేసారు.   ETV Win కోసం OTT రైట్స్ తీసుకన్నారు.  ETV ఛానెల్ కోసం శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. ఓటిటిలో ఈ చిత్రం జూలై 12, 2024 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 
   
 ‘హరోం హర’ సినిమా బతకడానికి ఓ ఊరు వచ్చిన హీరో అనుకోకుండా గన్స్ తయారీ బిజినెస్ లోకి దిగి ఆ ఊరికి దేవుడు లాంటి మనిషి ఎలా అయ్యాడు అనేది ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో చెప్పారు. సాంకేతికంగా మాత్రం చాలా బాగుంది అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ విజువల్స్, కొత్త కలర్ ప్యాలెట్ తో చాలా బాగున్నాయి. చేతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. 
 

కథేంటి

Latest Videos

కుప్పం నేపధ్యంలో ఎనభైల్లో జరిగే కథ ఇది. అప్పట్లో ఆ ప్రాతాన్ని మకుటం లేని మహారాజుల్లా  తిమ్మారెడ్డి , అతని సోదరుడు బసవ(రవి కాలె), కొడుకు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) పాలిస్తూంటారు. వాళ్లు ఏం చెప్తే అది జరగాలి. వాళ్లు చెప్పిందే న్యాయం, చట్టం. జనం చివరకు తలెత్తి వాళ్లను చూడాలన్నా చిచ్చు పోసుకుంటూకుంటూంరు. అలా నలిగిపోతున్న వారిని కష్టాలను బయిటపడేయటానికి ఓ సేవియర్ కావాలి. అందుకోసం ఎదురుచుస్తున్నట్లున్నట్లుగా ఉంటుంది సిట్యువేషన్. ఇంతకీ ఆ సేవియర్ ఎవరూ అంటే... సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) .
 
అక్కడికి కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేయటానికి  సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తాడు. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ అయ్యి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. ఉద్యోగం లేక  ఆర్థికంగా  ఇబ్బంది పడుతూంటాడు. ఇంటికి వెళ్లిపోదామంటే తండ్రి శివారెడ్డి (వి జయప్రకాశ్) అప్పులు పాలై ఉంటారు.  అప్పులు ఇచ్చినోళ్లు అంతా ఇంటి మీద పడుతూంటారు. వాళ్లకు మూడు నెలల్లో బాకీ తీరుస్తానని వాళ్లకు మాట ఇచ్చి మరీ  కుప్పం వస్తాడు. 
 
అప్పుడు తన ప్రెండ్ ఆల్రెడీ  సస్పెండెడ్ కానిస్టేబుల్ పళని స్వామి(సునీల్) దగ్గర ఒక తుపాకీ చూస్తాడు. ఆ తుపాకీతో పాటు ఒక బ్లూ ప్రింట్ కూడా ఉండటం గమనిస్తాడు. అంతే అక్కడ నుంచి తన లైఫ్ మార్చుకుంటాడు. పళని స్వామి (సునీల్)తో కలిసి అక్రమంగా తుపాకీలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. ఆ బిజినెస్ లో భారీగా సంపాదించే సుబ్రమణ్యంకి శత్రువులు తయారుఅవుతారు. ఈ క్రమంలో తమ్మి రెడ్డి కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) మనుషులతో స్నేహం ఏర్పడుతుంది. కానీ.. ఒక రోజు తన తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రమణ్యం కొడతాడు.అసలు శరత్ రెడ్డికి, సుబ్రమణ్యం తండ్రికి మధ్య గొడవలేంటి..చివరకి  సుబ్రహ్మణ్యం పరిస్దితి ఏమైంది.  ఆ ఊరువారు ఆశించినట్లుగా అతను వాళ్లకు సేవియర్ గా మారాడా...   ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ ఎందుకు పెట్టారు? లాంటి విషయాలు మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

click me!