మొత్తానికి సమంతకు క్షమాపణ చెప్పాడు

By Surya PrakashFirst Published Jul 7, 2024, 6:58 AM IST
Highlights

సమంత చెప్పినట్టు చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇలాంటి సలహాలు ఇస్తున్న ఆమెను జైళ్లో పెట్టాలంటూ మాటల దాడి చేశారు.


సమంతకు డాక్టర్ లివర్ డాక్ కు మధ్య సోషల్ మీడియా పోస్ట్ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.   ఇటీవల సమంత పెట్టిన  డాక్టర్‌ లివర్‌ డాక్‌ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపి నెబ్యులైజేషన్‌ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం ఉంటుందని సూచిస్తూ పోస్ట్‌ షేర్‌ చేసింది. దీనిపై డాక్టర్‌ లివర్‌ డాక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజల ఆరోగ్యంతో సమంత ఆటాడుతుందంటూ మండిపడ్డారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని లేదని ఆయన అన్నారు. సమంత చెప్పినట్టు చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇలాంటి సలహాలు ఇస్తున్న ఆమెను జైళ్లో పెట్టాలంటూ మాటల దాడి చేశారు.

 తనను జైల్లో పెట్టాలంటూ వార్నింగ్‌ ఇచ్చిన డాక్టర్‌ పోస్ట్‌పై సమంత స్పందించారు. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైనదని.. డబ్బులు లేని వాళ్లు అలాంటి వైద్యం ఎలా తీసుకుంటారోనని ఎప్పుడూ ఆలోచిస్తుంటానని ఆమె (Samantha) తెలిపారు.  డాక్టర్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఒక పెద్దమనిషి నా పోస్ట్‌ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. 

Latest Videos

ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్‌ చేశాను’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

ఈ క్రమంలో డాక్టర్‌ లివర్‌ డాక్‌  ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్‌ షేర్‌ చేశారు. "నేను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఆమె ఆరోగ్యంపై షేర్‌ చేసిన పోస్ట్‌ను నేను ఖండించాను. ఈ క్రమంలో నేను వాడిని పదజాలం ఆమెకు బాధపెట్టింది. ఇందుకు ఆమెను క్షమాపణలు కోరుతున్నాను. కానీ అవి నేను కావాలని చేసినవి కాదు. అనుకోకుండ అలా జరిగింది. ఆమెను విమర్శించడం నా ఉద్దేశం కాదు. నిజానికి అది సమంత తప్పు కాదు. ఆమెకు ఆ చికిత్స చెప్పిన డాక్టర్‌ది. అతడి సొంత లాభం కోసం సమంత స్టార్‌ డమ్‌ని ఉపయోగించుకున్నాడు. సమంత లాంటి సెలబ్రిటీల ద్వారా హనికరమైన సమచారాన్ని ప్రజలకు ప్రచారం చేయిస్తున్నారు. దీనిని మాత్రమే నేను ఖండించాను" అని ఆయన వివరణ ఇచ్చారు. 

click me!