
సమ్మోహనం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సుదీర్ బాబు తరువాత సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి నన్ను దోచుకుందువటే సినిమాను నిర్మించాడు. ఇటీవల విడుదలైన ఆ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా సినిమా పెద్దగా రాణించలేపోయింది. స్టడీగా కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమాకు మరికాస్త బజ్ క్రియేట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.
సుదీర్ గత చిత్రాలకు కొన్ని సార్లు బావ మహేష్ ద్వారా ప్రమోషన్ నిర్వహించినట్లే మరోసారి తాను నిర్మించిన సినిమాకు ప్రమోట్ చేయించాలని అనుకుంటున్నాడు. మహేష్ బావ కోసం రావడానికి ఏ మాత్రం సందేహించడు. తన సపోర్ట్ ఎప్పటికి ఉంటుందని చాలా సార్లు చెప్పాడు. ఇక సక్సెస్ మీట్ నిర్వహించి మహేష్ ను స్పెషల్ గెస్ట్ గా రప్పించాలని సుదీర్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మహేష్ నాలుగు మాటలు చెప్పినా సినిమాకి మంచి క్రేజ్ వచ్చినట్లే. ఫైనల్ గా సుదీర్ బాబు నిర్మాతగా సక్సెస్ అయ్యాడా లేదా అనేది తెలియడానికి కాస్త సమయం పట్టవచ్చు. ఆర్.ఎస్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాభ నటేష్ హీరోయిన్ గా నటించింది.