ఒక్క హిట్టుకే ఇంత పొగరా పాయల్..?

Published : May 30, 2019, 03:15 PM IST
ఒక్క హిట్టుకే ఇంత పొగరా పాయల్..?

సారాంశం

'RX100' చిత్రంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది పాయల్ రాజ్ పుత్. 

'RX100' చిత్రంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది పాయల్ రాజ్ పుత్. పలు పంజాబీ, తమిళ చిత్రాల్లో నటించినా రాని క్రేజ్ తెలుగులో ఒక్క సినిమాతోనే వచ్చేసింది. దీంతో వరుస ప్రాజెక్ట్ లు, మాల్ ఓపెనింగ్స్ అంటూ బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ నూతన దర్శకుడు రూపొందిస్తోన్న సినిమా కూడా ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి పాయల్ చెప్పిన సమయం కంటే ఆలస్యంగా వస్తోందట.

సెట్స్ కి ఆలస్యంగా రావడమే కాకుండా గంటల కొద్దీ సమయంలో తన కార్వాన్ లోనే గడుపుతుందట. ఫోన్ చూసుకుంటూ ఎక్కువ సమయం కార్వాన్ లోనే ఉండడంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశ్నించాడట. వారికి కూడా సమాధానాలు పొగరుగా ఇస్తుండడంతో వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.

ఒక్క సినిమా హిట్ అయితేనే ఇంత పొగరా అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారట. ఇదే నిజమైతే పాయల్ ఎక్కువరోజులు ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేదు. ఇప్పటికైనా ఈమె తన ప్రవర్తన మార్చుకొని పరిస్థితిని అర్ధం చేసుకొని మలుచుకుంటే మంచింది. 

PREV
click me!

Recommended Stories

Dhanush: మృణాళ్ కంటే ముందు ధనుష్ ఇంత మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా?
Allari Naresh: అల్లరి నరేష్‌ ఇంట్లో విషాదం.. తాత కన్నుమూత.. కారణం ఇదే