ఆంధ్ర కోసం అల్లు అర్జున్ విరాళం ఎంతంటే!

Published : Oct 20, 2018, 02:47 PM IST
ఆంధ్ర కోసం అల్లు అర్జున్ విరాళం ఎంతంటే!

సారాంశం

చెన్నై - కేరళ తుఫాను బాధితులకు ఇంతకుముందు ఆర్థికంగా తనవంతు సహాయాన్ని అందించిన స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. 

నటుడిగా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా అభిమానుల మనసులో ఎప్పటికి నిలిచిపోయేది మాత్రం కొందరే. ఇతరులకు సహాయాన్ని అందించే గుణమున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. చెన్నై - కేరళ తుఫాను బాధితులకు ఇంతకుముందు ఆర్థికంగా తనవంతు సహాయాన్ని అందించిన స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. 

తీతలి  తూఫాను ధాటికి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వందల కుటుంబాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీకాకుళం వాసులు ఎక్కువగా నష్టపోయారు. దీంతో కొంతమంది సినీ తారలు వారికి తోచినంత సహాయాన్ని అందిస్తు వస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా 25లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. 

ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ఆయనే తెలిపారు. మంత్రి నారా లోకేష్ అల్లు అర్జున్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని బన్నీ పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?