హైదరాబాద్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్న స్ట్రీట్ కాజ్.. ఏప్రిల్ 8న సందడి చేయబోతున్న ఆర్మాన్ మాలిక్

స్ట్రీట్ కాజ్ ఎన్జీవో హైదరాబాద్‌లో వచ్చే నెల 8వ తేదీన మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నది. ఈ మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొని సమాజ మార్పునకూ తోడ్పడాలని స్ట్రీట్ కాజ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బులను పేదలు, అణగారిన వర్గాల కోసం ఖర్చు చేయనున్నారు.
 

student run NGO street cause to organize RFC 9 concert in hyderabad, raising funds to serve underserved communities kms

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో విద్యార్థులు నడిపే అతిపెద్ద ఎన్జీవో స్ట్రీట్ కాజ్ వచ్చే నెల 8వ తేదీన మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మ్యూజిక్ ఈవెంట్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన ఫండ్‌ను అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటుగా ఈ ఎన్జీవో ఖర్చు పెట్టనుంది. టుటోరియల్స్ పాయింట్‌తో కలిసి స్ట్రీట్ కాజ్ ఈ ప్రోగ్రామ్ కాండక్ట్ చేస్తున్నది. 

ఈ మ్యూజిక్ ఈవెంట్‌లో ప్రముఖ బాలీవుడ్ సింగర్, సాంగ్ రైట్ర్, యాక్టర్ ఆర్మాన్ మాలిక్ సందడి చేయబోతున్నారు. ఆర్మాన్ మాలిక్‌తోపాటు హైదరాబాద్‌లోని టాప్ బ్యాండ్‌లలో ఒకటైన క్యాప్రిషియో పార్టిసిపేట్ చేస్తున్నది. వీరు సృష్టించే సంగీత మాధుర్యంలో మునిగి ఆ రోజు నైట్ ఎంజాయ్ చేయాలని ఎన్జీవో స్ట్రీట్ కాజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Latest Videos

ఈ ఈవెంట్‌లో ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు భిన్నమైన జానర్లు రాక్ నుంచి మాస్, క్లాసిక్స్ వరకు వైవిధ్యభరిత సంగీతాన్ని ప్రదర్శిస్తారు. మ్యూజిక్‌తోపాటు వెరైటీ ఫుడ్ అందించే స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. పలు రకాల ఫుడ్, డ్రింక్స్ ఇక్కడ లభిస్తాయి. ఈవెంట్‌కు రాకపోకల కోసం ప్రత్యేకమైన డిస్కౌంట్ వోచర్లతో  ర్యాపిడో ప్రయాణం చౌకగా అందుబాటులో ఉంటుంది.

Also Read: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్ట్రీట్ కాజ్ - వీబీఐటీ

సంగీత ప్రియులై, ఒక మధుర జ్ఞాపకంగా నిలిచే రాత్రిని సొంతం చేసుకోవాలనుకునేవారు ఈ ఈవెంట్‌కు హాజరై మ్యూజిక్‌ను, అలాగే, డిఫ్రెంట్ ఫుడ్ ఆస్వాదించాలని నిర్వాహకులు కోరారు. టికెట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భిన్నమైన ఆలోచనలు, లక్ష్యాలు గల విద్యార్థులంతా కలిసి సమాజంలో మార్పు కోసం స్ట్రీట్ కాజ్ అనే ఎన్జీవో వేదికగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు స్ట్రీట్ కాజ్ 15వేలకు పైగా ప్రాజెక్టులు నిర్వహించింది.

vuukle one pixel image
click me!