నితిన్ 'పవర్ పేట' కథా నేపధ్యం ఇదే

By Udaya DFirst Published Apr 1, 2019, 10:02 AM IST
Highlights

వరుస పెట్టి  'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కల్యాణం'   డిజాస్టర్లు తరువాత యువ హీరో నితిన్ మార్కెట్ బాగా డౌన్ అయ్యిపోయింది. 

వరుస పెట్టి  'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కల్యాణం'   డిజాస్టర్లు తరువాత యువ హీరో నితిన్ మార్కెట్ బాగా డౌన్ అయ్యిపోయింది.  దాంతో తనను తాను ప్రూవ్ చేసుకుని మళ్లీ నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతం వేణు కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' సినిమా చేస్తున్న  నితిన్ ... కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ చిత్రానికి 'పవర్ పేట' అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రం ప్రకటించగానే మంచి క్రేజ్ వచ్చింది.  ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వార్త మీడియా సర్కిల్ లో వైరల్ గా మారింది.

అదేమిటంటే...ఈ సినిమా  ఓ వింటేజ్ డ్రామా. సినిమా ట్రయోలజీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.  దాదాపు ముప్పై ఏళ్ల నాటి రౌడీయిజం ను ఈ సినిమాలో చూపబోతున్నట్లు చెప్తున్నారు. అప్పట్లో పశ్చిమ గోదావరి ఏలూరులోని పవర్ పేట రైల్వే స్టేషన్ , ఆ చుట్టు ప్రక్కల జరిగిన కొన్ని హత్యలు, రౌడీయిజం ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఏలూరు బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరుగుతుందని అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు. నితిన్ తన సొంత బ్యానర్ పై బాగా ఖర్చు పెట్టడానికి సిద్దపడ్డాడని అంటున్నారు. 

మరో ప్రక్క  ...నితిన్‌కు పవన్‌కళ్యాణ్ అంటే వీరాభిమానం. అందుకే పవర్‌స్టార్ గుర్తుకు వచ్చేలా ‘పవర్ పేట’ అని టైటిల్‌ను ఖరారు చేసాడంటున్నారు. భీష్మ, చంద్రశేఖర్ యేలేటి చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ‘పవర్‌పేట’ చిత్రం చేస్తాడు నితిన్. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తుంది.

click me!