Singer Sunitha:హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కుమారుడు!

Published : Feb 01, 2022, 07:43 AM IST
Singer Sunitha:హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కుమారుడు!

సారాంశం

స్టార్ సింగర్ సునీత (Singer Sunitha) కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి దానికి పక్కాగా రంగం సిద్ధమైనట్లు వినికిడి. నిర్మాత కూడా రెడీగా ఉన్న నేపథ్యంలో లాంచింగ్ లాంఛనమే అంటున్నారు. 


సింగర్ సునీత కుమారుడు పేరు ఆకాష్ (Akash). పాతికేళ్ల ప్రాయంలో ఉన్న ఆకాష్ ని హీరో చేయాలని సింగర్ సునీత కొన్నాళ్లుగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా సునీత పరిశ్రమలో ఉన్నారు. ఆమెకు అనేక మంది దర్శక నిర్మాతలతో పరిచయాలున్నాయి. దీంతో ఆకాష్ ని హీరోగా లాంఛ్ చేసి, అతడు టాలీవుడ్ లో హీరోగా సెటిల్ అయ్యేలా చేయాలనేది సునీత ఆలోచనగా తెలుస్తుంది. 

పరిచయాలు ఉన్నప్పటికీ హీరోగా లాంచ్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా నిర్మాతలు దొరకరు. ఓ కొత్త హీరోపై పెట్టుబడి పెట్టడానికి అందరూ ఆసక్తి చూపించరు. దాని కారణంగా ఆకాష్ అరంగేట్రానికి ఆలస్యం అయ్యింది. అయితే గత ఏడాది సునీత రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మాంగో మీడియా ఓనర్ రామ్ వీరపనేని ఆమెను వివాహం చేసుకున్నారు. 2021 జనవరిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 

మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో రామ్ కి అనుభవం ఉంది. ఆయనకు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఆయన చాలా స్ట్రాంగ్. ఈ క్రమంలో ఆకాష్ తో రామ్ మూవీ చేయనున్నారట. ఆకాష్ డెబ్యూ మూవీకి నిర్మాతగా రామ్ వ్యవహరించనున్నారని వినికిడి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

పిల్లల కెరీర్ కోసమే రెండో పెళ్లి నిర్ణయమని చెప్పిన సునీత... అదే చేస్తున్నారు. భర్త రామ్ సహాయంతో ఆకాష్ కెరీర్ కి బాటలు వేస్తున్నారు. సునీత పెళ్లి నిర్ణయాన్ని అప్పట్లో కొందరు తప్పుబట్టారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉండగా 42 ఏళ్ల వయసులో రెండో వివాహం అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో మెజారిటీ వర్గాలు ఆమె నిర్ణయానికి మద్దతు  తెలిపారు. రెండో వివాహం చేసుకుంటే తప్పేంటి అంటూ బాసటగా నిలిచారు. 

సునీత కుమార్తె శ్రేయ కూడా సింగర్. కొన్ని మ్యూజిక్ రియాలిటీ షోలలో పాల్గొన్న శ్రేయా...ఒకటి రెండు సినిమాలకు కూడా పాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పిల్లలకు మంచి భవిష్యత్ కల్పించాలని సునీత తాపత్రయ పడుతున్నారు. ఇక 17 ఏళ్లకే ప్లే బ్యాక్ సింగర్ గా చిత్ర పరిశ్రమకు పరిచయమైన సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు. వందల చిత్రాలకు ఆమె డబ్బింగ్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే