30 Weds 21 Season 2 Teaser: సింపుల్ రొమాన్స్ తో మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నారు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 31, 2022, 10:47 PM ISTUpdated : Jan 31, 2022, 11:41 PM IST
30 Weds 21 Season 2 Teaser: సింపుల్ రొమాన్స్ తో మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నారు

సారాంశం

ఈ ఏడాది విడుదలైన '30 వెడ్స్ 21' తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. చాయ్ బిస్కెట్ సంస్థ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ యువతలో బాగా పాపులర్ అయింది. 

ఈ ఏడాది విడుదలైన '30 వెడ్స్ 21' తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. చాయ్ బిస్కెట్ సంస్థ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ యువతలో బాగా పాపులర్ అయింది. 30 ఏళ్ల వయసున్న ఐటీ జాబ్ చేసే వ్యక్తి.. 21 ఏళ్ల వయసున్న అందాల యువతని పెళ్లి చేసుకుంటే వారిద్దరి మ్యారేజ్ లైఫ్ ఎలా మొదలయింది అనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. 

ఈ వెబ్ సిరీస్ లో చైతన్య రావు, అనన్య జంటగా నటించారు. ఇద్దరి మధ్య బ్రీజీ రొమాన్స్ కు యువత ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువ నటి అనన్య తన క్యూట్ పెర్ఫామెన్స్, లుక్స్ తో కట్టి పడేసింది. చైతన్య రావు కూడా తనకన్నా బాగా వయసు తక్కువున్న భార్యతో సతమతమవుతూ సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. 

ఇప్పుడు ఈ జంట రెండవ సీజన్ తో రెడీ అయిపోయారు. తాజాగా టీజర్ కూడా విడుదలయింది. సింపుల్ రొమాన్స్, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్ తో టీజర్ చాలా బావుంది. మరోసారి 30 వెడ్స్ 21 టీం బలంగా ఆకట్టుకోబోతున్నట్లు ఇట్టే చెప్పేయొచ్చు. 

 

టీజర్ చివర్లో 'తండ్రి భుజాల పైనుంచి చూసే ప్రపంచం, మన కాళ్లపై నిలబడి చూసే ప్రపంచం రెండూ ఒక్కటిగా ఉండవు' అంటూ చెతన్య చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయనున్నారు. పృథ్వీ వనం దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. 

 

 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?