సినిమాలకు బ్రేక్‌ ప్రకటించిన మరో స్టార్‌ హీరో.. కారణం ఏంటంటే?

ఇప్పుడు మరో స్టార్‌ హీరో బ్రేక్‌ని ప్రకటించడం విశేషం. బాలీవుడ్‌ లో ఛాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రణ్‌బీర్‌ కపూర్‌ తాజాగా అభిమానులకు షాకిస్తూ బ్రేక్‌ ని ప్రకటించారు. 

Google News Follow Us

ఇప్పటికే సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. అలాగే టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ సైతం ఏడాది పాటు సినిమాల నుంచి బ్రేక్‌ ప్రకటించారు. వీరిద్దరు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకునేందుకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మరో స్టార్‌ హీరో బ్రేక్‌ని ప్రకటించడం విశేషం. బాలీవుడ్‌ లో ఛాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రణ్‌బీర్‌ కపూర్‌ తాజాగా అభిమానులకు షాకిస్తూ బ్రేక్‌ ని ప్రకటించారు. 

అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే బ్రేక్‌ తీసుకోనున్నట్టు చెప్పారు. రణ్‌బీర్‌ బ్రేక్‌ తీసుకోవడానికి కారణం తన కూతురు రాహా. హీరోయిన్‌ అలియాభట్‌, రణ్‌బీర్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో వీరి మ్యారేజ్‌ జరిగింది. వీరికి నవంబర్‌ 6న పాప రాహా జన్మించింది. ఆ చిన్నారి జన్మించి ఏడాది కావస్తుంది. కానీ ఆమెతో గడపడానికి టైమ్‌ లేదట. తన బిజీ షెడ్యూల్‌ కారణంగా పాపతో టైమ్‌ కేటాయించలేకపోతున్నారట రణ్‌బీర్‌. అందుకే సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 

ఆయన మాట్లాడుతూ, చాలా రోజులుగా నా కూతురు రాహాతో టైమ్‌ స్పెండ్‌ చేయాలనుకుంటున్నా, కానీ కుదరడం లేదు, సినిమాలకు సంబంధించిన బిజీ షెడ్యూల్‌ కారణంగా తనతో సమయం గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆరు నెలలు రాహాతోనే ఉండాలనుకుంటున్నా. `యానిమల్‌` చిత్రం తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయలేదు. రాహా ఇప్పుడిప్పుడే అన్నింటిని గుర్తిస్తుంది. ప్రేమని పంచుతుంది. మాట్లాడానికి ప్రయత్నిస్తుంది. ఈ అందమైన, మధురమైన క్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నా. ఆరు నెలలు పూర్తిగా ఆమెతోనే స్పెండ్‌ చేస్తాను` అని తెలిపారు. 

ప్రస్తుతం రణ్‌ బీర్‌ కపూర్.. `యానిమల్‌` చిత్రంలో నటిస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదల కాబోతుంది. గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అయితే ఇందులో ఓ పాటలో రణ్‌బీర్‌, రష్మిక లిప్‌ లాక్‌ మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...