బుద్ధి, బలం చూపించి కండల వీరులను మట్టికరిపించిన రైతు బిడ్డ!

By Sambi Reddy  |  First Published Oct 25, 2023, 6:17 PM IST

బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. మొదటి టాస్క్ లో ప్రియాంక గెలవగా... రెండో టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి సత్తా చాటాడు. 


బిగ్ బాస్ మారథాన్ పేరుతో కెప్టెన్సీ టాస్క్ మొదలుపెట్టారు. ప్రతి టాస్క్ లో గెలిచినవారు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. సదరు టాస్క్ లో అందరికంటే వెనుకబడ్డవారు కంటెండర్ రేసు నుండి తప్పుకుంటారు. మొదటి టాస్క్ లో తేజా, శోభా, ప్రియాంక, అమర్ దీప్ పోటీపడ్డారు. బ్రెయిన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, ఒక్కొక్క వస్తువును సంచాలక్ చూపిస్తూ ఉంటాడు. అది నీటిలో మునుగుతుందో? తేలుతుందో? చెప్పాలి. 

ఫైవ్ స్టార్ చాకోలెట్ విత్ కవర్, విత్ అవుట్ కవర్, పుచ్చకాయ, వేరు శనక్కాయ, ప్లాస్టిక్ గ్లాస్, ఐస్, కోక్ టిన్  వంటి వస్తువులు మునుగుతాయో లేదో చెప్పాలని ఈ నలుగురిని అడిగారు. ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ సరైన  సమాధానాలు చెప్పి ప్రియాంక గెలిచింది. తక్కువ సమాధానాలు చెప్పిన శోభా శెట్టి ఓడిపోయింది. దీంతో ఆమె కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో శోభా శెట్టి ముఖం మాడిపోయింది. 

Latest Videos

ఇక రెండో టాస్క్ లో మరో నలుగురు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. రంగుల బాక్సులను ఎత్తకుండా ఒక ఆర్డర్ లో అమర్చాలి. ఎవరు ముందుగా అమరుస్తారో వారు విన్నర్. చివరిగా అమర్చిన వాళ్ళు కంటెస్టెంట్ టాస్క్ నుండి తప్పుకుంటారు. ఈ టాస్క్ లో గౌతమ్, యావర్, పల్లవి ప్రశాంత్, రతిక రోజ్ పోటీపడ్డారు. ఇది బుద్ధి తో పాటు బలం ఉపయోగించి గెలవాల్సిన టాస్క్. 

ఆ రెండు చూపించి కండల వీరులైన గౌతమ్, యావర్ లను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మట్టికరిపించాడు. అందరికంటే ముందు బాక్సులు సక్రమంగా అమర్చి గంట కొట్టాడు. తర్వాత యావర్ అమర్చాడు. చివర్లో అమర్చిన రతిక కంటెండర్ రేసు నుండి తప్పుకుంది. పల్లవి ప్రశాంత్ మరోసారి సత్తా చాటాడు... 

completed game with in 10sec 🔥 🔥 pic.twitter.com/V7Q4P8lIZg

— Durga Goud (@DurgaGoud95)

 

 

click me!