రజనీ డైరెక్టర్‌ శివకి పితృవియోగం.. శోకసంద్రంలో కోలీవుడ్‌

Published : Nov 28, 2020, 08:07 PM IST
రజనీ డైరెక్టర్‌ శివకి పితృవియోగం.. శోకసంద్రంలో కోలీవుడ్‌

సారాంశం

ప్రముఖ తెలుగు, తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శివకి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి జయకుమార్ వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ప్రముఖ తెలుగు, తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శివకి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి జయకుమార్ వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివ ఇప్పుడు కోలీవుడ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.

 అయితే జయకుమార్‌ దాదాపు నాలుగు వందలకుపైగా షార్ట్ ఫిల్మ్ లకు, డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఫోటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపుని, పేరుని సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వేలన్‌ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. ఆయన నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 

ఇక జయకుమార్‌కి ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు శివ దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. చిన్న కుమారుడు బాలా మలయాళ చిత్ర పరిశమ్రలో నటుడిగా రాణిస్తున్నారు. శివ సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. తెలుగులో ఆయన `శ్రీరామ్‌`, `నేనున్నాను`, `మనసు మాట వినదు`, `గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ`, `బాస్‌` వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు శివ. 

ఆ తర్వాత గోపీచంద్‌ హీరోగా రూపొందిన `శౌర్యం` చిత్రంతో దర్శకుడిగా మారారు. `శంఖం`, `దరువు` చిత్రాలను తెలుగులో రూపొందించారు. తెలుగులో సరైన గుర్తింపు రాకపోవడంతో తమిళంలోకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కార్తీ హీరోగా `సిరుతాయ్‌`, ఆ తర్వాత స్టయిలీష్‌ హీరో అజిత్‌తో `వీరం`, `వేదాళం`, `విశ్వాసం`, `వివేగం` వంటి చిత్రాలను రూపొందించి కమర్షియల్‌ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌ హీరోగా `అన్నాత్తే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రి మరణించడంతో శివ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక జయకుమార్‌ ఆత్మకి శాంతి చేకూరాలని తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?