41 ఇయర్స్ మహేష్‌ ఎరా@టాలీవుడ్ ‌..ట్రెండింగ్‌లో సీడీపీ

By Aithagoni RajuFirst Published Nov 28, 2020, 7:40 PM IST
Highlights

దాసరి నారాయణ రావు తాను రూపొందించిన `నీడ` చిత్రంలో బాలనటుడిగా మహేష్‌ని నటింప చేసి వెండితెరకు పరిచయం చేశాడు. కానీ అందులో మహేష్‌కి క్రెడిట్‌ దక్కలేదు. ఆ సమయంలో మహేష్‌ ఏజ్‌ నాలుగేళ్లే కావడం విశేషం.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా చేసింది 26 సినిమాలే. కానీ అప్పుడే చిత్ర పరిశ్రమలో 41ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర నటుల తరహాలో టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు మహేష్‌. మరి అదెలా అనే డౌట్‌ రావచ్చు. ఆయన బాలనటుడిగా నాలుగేళ్ళ వయసులోనే సినిమాల్లో నటించాడు. దీంతో ఇప్పుడు ఈ అరుదైన ఘనతని సాధించారు. ఓ రకంగా టాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలుగా మహేష్‌ ఎరా సాగిందని చెప్పొచ్చు. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడు మహేష్‌ అన్న విషయం తెలిసిందే. అప్పట్లో కృష్ణ స్టార్‌ హీరోగా రాణించారు. పెద్ద హీరో తనయుడు కావడం, క్యూట్‌గా, హ్యాండ్‌సమ్‌గా ఉండటంతో ఆయనపై ఫిల్మ్ మేకర్స్ దృష్టి పడింది. అందులో ఒకరు దాసరి నారాయణ రావు. తాను రూపొందించిన `నీడ` చిత్రంలో బాలనటుడిగా మహేష్‌ని నటింప చేసి వెండితెరకు పరిచయం చేశాడు. కానీ అందులో మహేష్‌కి క్రెడిట్‌ దక్కలేదు. ఆ సమయంలో మహేష్‌ ఏజ్‌ నాలుగేళ్లే కావడం విశేషం. 1979లో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు మహేష్‌ విజయవంతంగా 41ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 

ఈ సందర్బంగా తన అభిమానులు ప్రత్యేకమైన కామన్‌ డీపీని విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఎరా స్టార్ట్ అయి 41ఏళ్లు పూర్తి అంటూ విడుదల చేసిన సీడీపీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంద్రభవనాన్ని తలపించే భవంతి, ఆ తర్వాత మహేష్‌ సినీ ప్రస్థానాన్ని సూచించే సినిమా రీల్‌తోపాటు ప్రధానంగా మహేష్‌బాబు మైనపు విగ్రహం ఉంది. ప్రస్తుతం ఇది మహేష్‌ అభిమానులను అలరిస్తుంది. 

ఇక తొమ్మిది సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన మహేష్‌ 1999లో `రాజకుమారుడు` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత `యువరాజు`, `వంశీ`, `మురారీ`, `ఒక్కడు`, `నిజం`, `అర్జున్‌`, `అతడు`, `పోకిరి`, `దూకుడు`, `బిజినెస్‌మేన్‌`, `సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు`, `శ్రీమంతుడు`, `భరత్‌ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలతో మెప్పించారు. తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగారు. 

ప్రస్తుతం ఆయన `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తిసురేష్‌ హీరోయిన్ గా నటిస్తుంది. జనవరి నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

click me!