టాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు, స్టార్ హీరో సరసన గ్రాండ్ ఎంట్రీ...?

By Mahesh JujjuriFirst Published Aug 4, 2022, 8:02 PM IST
Highlights

టాలీవుడ్ లో సినిమా చేయాలని స్టార్లు సైతం ఆరాటపడుతుంటారు. చిన్ననటుల దగ్గర నుంచి పెద్ద నటుల వరకూ.. తెలుగు సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇక ఆలిస్ట్ లో ఇప్పుడు స్టార్ హీరో శంకర్, ఆయన కూతురు కూడా చేరారు. 
 

స్టార్ డైరెక్టర్ శంకర్ తమిళంలో మాత్రమే సినిమాలు చేసేవారు. ఆ సినిమాలు డబ్బింగ్ ద్వారా ఇతర భాషల్లో రిలీజ్ చేసేవారు. అంతే కాదు ఇతర భాషా హీరోలతో సినిమాలు చేయలేదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ప్రపంచ స్తాయిలో విజయ విహారంచేస్తుండటంతో.. శంకర్ సైతం తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్. 

సౌత్ స్టార్  డైరెక్టర్  శంకర్ గురించి ప్రతేకంగా చెప్పేదేముంది.  ఆయన గురించి తెలియనివాళ్లు ఉండరు. సౌత్ సినిమాను ముందుగా ప్రపంచ స్థాయికితీసుకెళ్లింది శంకరే. ఇక అలాంటిది శంకర్ తాను టాలీవుడ్ లో సినిమా చేయడంతో పాటు. తన కూతురును కూడా టాలీవుడ్ లో సినిమా చేసేలా  ప్రోత్సహిస్తున్నాడు. హీరోయిన్ గా ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన శంకర్ కూతురు అదితి శంకర్.. ఇక టాలీవుడ్ ఎంట్రీ కి కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 

 అదితి శంకర్ తెలుగులో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు  తాజా సమాచారం.  అది కూడా పెద్ద బ్యానర్లో.. స్టార్ హీరో సరసన ఆమె  హీరోయిన్ గా నటించబోతోందట.  ప్రస్తుతం ఈ  విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  ఇక శంకర్ కూతురంటే  ఆమె ఎంట్రీ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అదితి శంకర్ తెలుగు ప్రాజెక్టు ఏమిటనేది త్వరలో తెలియనుంది.

స్టార్ సీనియర్ డైరెక్టర్ గా ఉన్న శంకర్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అదితి శంకర్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇప్పటికే  అడుగుపెట్టింది. కార్తి హీరోగా నటించిన  విరుమన్  సినిమా ద్వారా ఆమె తమిళ తెరకి పరిచయం కానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ మూవీతో పాటు  ఆమె శివకార్తికేయన్ జోడిగా మావీరన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ తనయ.. టాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ సాధిస్తుందో చూడాలి. 
 

click me!