సోషల్‌ మీడియాకి స్టార్‌ డైరెక్టర్‌ గుడ్ బై.. అనుబంధంలో మార్పుండదంటూ..

Published : Jun 25, 2021, 07:43 PM ISTUpdated : Jun 25, 2021, 07:44 PM IST
సోషల్‌ మీడియాకి స్టార్‌ డైరెక్టర్‌ గుడ్ బై.. అనుబంధంలో మార్పుండదంటూ..

సారాంశం

సోషల్‌ మీడియాకి స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ గుడ్‌ బై చెప్పారు. సోషల్‌ మీడియా నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు కొరటాల శివ ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ ని పంచుకున్నారు. 

సోషల్‌ మీడియాకి స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ గుడ్‌ బై చెప్పారు. సోషల్‌ మీడియా నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు కొరటాల శివ ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ ని పంచుకున్నారు. మీడియం మారింది. కానీ మన మధ్య ఉన్న అనుబంధం మారదని వెల్లడించారు. 

ఆయన చెబుతూ, `నా సినిమా, నాకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నా. ఇకపై సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. దూరంగా ఉండాల్సిన సమయం వచ్చింది. మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటా. మీడియం మారింది కానీ మన మధ్య ఉన్న అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదు` అని పేర్కొన్నాడు కొరటాల శివ. 

ట్విట్టర్‌తోపాటు ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కూడా ఆయన వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. ఉన్నట్టుండి కొరటాల శివ ఎందుకు సోషల్‌ మీడియా నుంచి వెళ్లిపోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదొక కొత్త చర్చకు తెరలేపుతుంది. నెటిజన్ల నుంచి వచ్చే కామెంట్లే కారణమా? లేక వరుసగా సినిమాలతో బిజీ అయ్యే క్రమంలో సోషల్‌ మీడియాని హ్యాండిల్‌ చేయలేకపోతున్నాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. 

ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవితో `ఆచార్య` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. దీని తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో `ఎన్టీఆర్‌30` చేయబోతున్నారు. అలాగే అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా లైన్‌లో ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు