డబ్బు కోసం అమ్రీష్‌ని కేసుల్లో ఇరికించారు.. సీనియర్‌ నటి జయచిత్ర..

Published : Jun 25, 2021, 05:28 PM IST
డబ్బు కోసం అమ్రీష్‌ని కేసుల్లో ఇరికించారు.. సీనియర్‌ నటి జయచిత్ర..

సారాంశం

సంగీత దర్శకుడు అమ్రీష్‌ని అక్రమ కేసుల్లో ఇరికించారని అన్నారు సీనియర్‌ నటి జయచిత్ర. నటుడు, సంగీత దర్శకుడు అమ్రీష్‌పై అక్రమంగా బనాయించిన కేసులను మద్రాస్‌ హైకోర్ట్ కొట్టివేసిందని నటి జయచిత్ర తెలిపారు. 

డబ్బులు కాజేయాలని తన అబ్బాయి, నటుడు, సంగీత దర్శకుడు అమ్రీష్‌ని అక్రమ కేసుల్లో ఇరికించారని అన్నారు సీనియర్‌ నటి జయచిత్ర. నటుడు, సంగీత దర్శకుడు అమ్రీష్‌పై అక్రమంగా బనాయించిన కేసులను మద్రాస్‌ హైకోర్ట్ కొట్టివేసిందని నటి జయచిత్ర తెలిపారు. అన్ని కేసులను కొట్టి వేసినట్టుగా తనకు కోర్ట్ నుంచి పత్రాలు అందాయని తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం  మీడియాతో మాట్లాడారు. 

`సంగీత దర్శకుడిగా తమిళ సినీ ప్రపంచంలో దూసుకుపోతున్న మా అమ్మాయిని ఇరీడియం కేసులో ఇరికించి పెద్ద ఎత్తున డబ్బు కాజేయాలని కుట్రలు పన్నారు. అందులో అమ్రీష్‌కి ఎలాంటి సంబంధం లేదని ఈ నెల 15న కోర్ట్ తీర్పు చెప్పింది. అలాగే తనపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసినట్టుగా కోర్టు నుంచి నాకు బుధవారం పత్రాలు అందాయి. అమ్రీస్‌ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అక్రమ కుసుల్లో ఇరికించడం తల్లిగా నాకు చాలా బాధ కలిగించింది. దైవానుగ్రహం వల్ల న్యాయమే గెలిచింది. ఇకపై అమ్రీష్‌కి అన్నీ తానై వ్యవహాలను పర్యవేక్షిస్తాను. 

కేసుల నుంచి బయటపడిన అమ్రీష్‌కి అభినందనలు తెలిపిన సినీ ప్రముఖులకు జయచిత్ర ధన్యవాదాలు తెలిపారు. జయచిత్ర హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నెగటివ్‌ రోల్స్ వంటివి చేసిన ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించారు. ఆమె దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో `నరసింహుడు`, `అదృష్టం`, `సమరసింహారెడ్డి`, `ఘరానా బుల్లోడు`, `అబ్బాయిగారు`, `మువ్వగోపాలుడు`, `బొబ్బిలి పులి`, `అన్నదమ్ముల సవాల్‌`, `కటకటాల రుద్రయ్య`, `నిండు మనిషి`, `ఆత్మీయుడు`, `సోగ్గాడు`, `మా ధైవం` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు