‘ది వారియర్’ నుంచి మరో సాలిడ్ సాంగ్ రెడీ.. ‘విజిల్’తో దుమ్ములేపనున్న రామ్ పోతినేని..

Published : Jun 20, 2022, 03:01 PM IST
‘ది వారియర్’ నుంచి మరో సాలిడ్ సాంగ్ రెడీ..  ‘విజిల్’తో దుమ్ములేపనున్న రామ్ పోతినేని..

సారాంశం

రామ్ పోతినేని,  కృతి శెట్టి  జంటగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ దుమ్ములేపుతున్నాయి. తాజాగా మరో సాలిడ్ సాంగ్ ను రెడీ చేసినట్టు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.  

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తాజాగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘ది వారియర్’. ఈ  చిత్రంలో రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందుకు తగట్టుగా తన మేకర్ ఓవర్ ను కూడా అదిరిపోయేలా మార్చేశాడు.  తమిళ మాస్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో The Warriorను డైరెక్ట్ చేస్తున్నారు. రామ్ సరసన యంగ్ హీరోయిన్  కృతి శెట్టి (Krithi Shetty) విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు.

ది వారియర్ నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ కూడా రామ్ ఎనర్జీని మరింతగా పెంచేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇస్మార్ట్ హీరోకు తగ్గట్టుగా ఇప్పటికే రిలీజ్ అయిన ‘బుల్లెట్’ సాంగ్ దుమ్ములేపుతోంది. ఆ తర్వాతే వచ్చిన రొమాంటిక్ సాంగ్  ‘దడ దడ’ ట్రాక్ కూడా దూసుకెళ్లోంది. తాజాగా మరో సాలిడ్ సాంగ్ ను ‘విజిల్’ (Whistle) టైటిల్ తో రెడీ చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. జూన్ 22న సాయంత్రం 7:12 నిమిషాలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ అనౌన్స్ మెంట్ చేస్తూ వదిలిన పోస్టర్ ఫుల్ కిక్ నిస్తోంది.  రామ్ పోతినేని మోకాలిపై కూర్చొని విజిల్ వేస్తున్న స్టైల్ ఊర మాస్ గా కనిపిస్తోంది.  మరోవైపు కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తోనూ అదరగొట్టాడు రామ్. పోస్టర్ సాంగ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ వరుస  అప్డేట్స్ అందిస్తున్నారు. ఇది వరకే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై వేరే లెవల్ లో అంచనాలను నెలకొల్పాయి.   శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తున్నాడు.  జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు