స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)పై ఎన్నోమార్లు ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ తో తాజాగా చాట్ చేసిన సందర్భంగా అనసూయ మరోసారి వాటిపై స్పందించారు.
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో యాంకర్ గా టీవీ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. 2013 నుంచి యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసింది. కేవలం యాంకరింగ్ తోనే కాకుండా.. స్మాల్ స్క్రీన్ పైనా గ్లామర్ ఒళికిస్తూ బుల్లితెర ఆడియెన్స్ లో యమా క్రేజ్ దక్కించుకున్నారు. చురుకుతనం, యాంకరింగ్ స్కిల్స్, అందంతో తక్కువ సమయంలోనే బుల్లితెర స్టార్ గా ఎదిగింది.
అయితే, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు... యాంకర్ అనసూయ కూడా తను ఎదిగేకొద్దీ పలు విమర్శలు, ట్రోల్స్ ను ఎదుర్కొంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. ఆయా అంశాలపై తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెబుతుంటారు. దీంతోనే పలు సందర్భాల్లో ట్రోల్స్ కు కూడా గురైంది. దీనిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు అనసూయ. తనదైన శైలిలో బదులిస్తూ ట్రోల్స్ ను ఖండిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి గతంలో వచ్చిన ట్రోల్స్ పై స్పందించారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు అనసూయ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో అప్పుడప్పుడు లైవ్ సెషన్స్, చాట్ సెషన్ నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా అభిమానులతో ముచ్చటించిన స్టార్ యాంకర్.. వారు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. ఈక్రమంలో ఓ అభిమాని.. ‘మీపై గతంలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎన్ని బ్యాడ్ వర్డ్స్ వచ్చినా మీ స్ఫూర్తిని వదల్లేదు’ అంటూ ప్రశ్నించాడు. దీనిపై అనసూయ స్పందిస్తూ.. ‘ఎందుకంటే మా అమ్మ నేర్పించింది. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని.. ఎదుటు వాళ్లు మనల్ని ఏమన్నా అది వాళ్ల క్యారెక్టర్ ను చూపిస్తుంది. మన క్యారెక్టర్ ఏంటో మనకే తెలుసు. ప్రూవ్ చేయాల్సిన వారికి చేయాల్సిన అవసరం రాదు.. మిగతా వారికి చేయాల్సిన అవసరం లేదంటూ’ గట్టిగా బదులిచ్చారు.
మరోవైపు అనసూయపై ఒకదశలో ట్రోలింగ్ తారా స్థాయికి చేరుకోవడంతో ఓ వ్యక్తిపైనా కేసు కేసు కూడా నమోదు చేయించి నోరూ మూయించింది. ఇక అనసూయ కేరీర్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తన ఫ్యామిలీకి అందే సమయం కేటాయిస్తుంటుంది. భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా గడుపుతుంటారు. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం నటిగానూ వెండితెరపై దుమ్ములేపుతోంది. చివరి ‘పుష్ప’లో దాక్షయణిగా అదరగొట్టింది. ఆ తర్వాత ‘పాండుగాడ్’, ‘మైఖేల్’లో మెరిసింది. ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్’,‘రంగమార్తండా’లో నటిస్తోంది.