Highest Paid Director: సినిమా హీరోకి భారీ పారితోషికాలు ఇవ్వడం మనం ఇప్పటి వరకు చూశాం. కానీ ట్రెండ్ మారింది. ప్రస్తుతం సినిమా హీరోకి ఎంత ప్రాధాన్యం ఉందో దర్శకుడికి అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నేటి నిర్మాతలు. హీరోకి రూ.50, 100, 200 కోట్లు ఇవ్వడం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి జరుగుతున్నదే.. కానీ ఓ తెలుగు డైరెక్టర్ హీరోలకు తక్కువ కాకుండా పారితోషికం తీసుకుంటున్నాడట. అదీ కూడా రూ.200 కోట్లకు తగ్గేదేలే అంటున్నాడట. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందామా?
ఇక పాన్ ఇండియా హీరోలు, బాలీవుడ్ యాక్టర్లు మాత్రమే రూ.100 నుంచి 200 కోట్లు తీసుకుంటున్నారు. తెలుగు పరిశ్రమకు చెందిన దర్శకుడు మాత్రం హీరోలకు మించి రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట. అంతేకాదు తను తీసిన సినిమా హిట్ టాక్ వచ్చి.. భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తే అందులోనూ షేర్ ఇవ్వాల్సిందేనట.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించి ఆడియన్స్‌ని మెప్పించాడు ఎస్ ఎస్ రాజమౌళి. దీంతో అమాంతం తన ఫేమ్ పెంచేసుకున్నాడు. దక్షిణాదితోపాటు... ఉత్తరాదిలో కూడా భారీగా తన సినిమాలకు కలెక్షన్స్ రాబట్టగలిగాడు. దీంతో రాజమౌళి తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడట. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.200 కోట్లకు పైగా అడుగుతున్నాడట.
రాజమౌళి తీసిన బాహుబలి-2 నార్త్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఏకంగా ఉత్తరాదిలోనే రూ.500కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ట్రిపుల్ ఆర్ కూడా రూ.250 కోట్లకు పైగా నార్త్‌లో కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు ఇప్పటి వరకు ఒక్క ప్లాప్‌సినిమా కూడా తీయలేదు. దీంతో వంద శాతం నమ్మకం ఉన్న డైరెక్టర్‌గా నిర్మాతలకు భరోసా వచ్చింది. దీంతో రాజమౌళి సినిమా అంటే.. ఎంతైనే బడ్జెట్ పెట్టేందుకు ప్రొడ్యూసర్లు రెడీ అయిపోతున్నారు. జెక్కన్నకు కూడా భారీగా పారితోషికం ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.
దేశంలోనే అధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని ఐఎండీడీ తెలిపింది. ఇందులో ప్రాఫిట్ షేర్, ఇతర లెక్కలు కలిపి ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సినిమా హిట్ అయితే.. రెమ్యూనరేషన్ ఇంకా పెరుగుతుందట. ట్రిపుల్ ఆర్ చిత్రానికి దాదాపు రూ. 200కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్ల వరకు తీసుకుంటున్నారు. నిజంగా రాజమౌళి రూ.200 కోట్లు తీసుకుంటే.. బాలీవుడ్ హీరోలను రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి నెట్టినట్లే.
ప్యాన్ ఇండియా డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ రూ. 90 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హీరాని రూ. 80కోట్లు తీసుకుంటుడగా.. ఆ తర్వాత సుకుమార్, సంజయ్ లీలా భన్సాలీ, లోకేశ్ కనగరాజన్, సిద్ధార్థ్ ఆనంద్ సినిమాకు రూ. 40కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. పలువురు దర్శకులు నిర్మాణం కూడా చేస్తుండటంతో వారికి ప్రాఫిట్‌లో పారితోషికం వెళ్లిపోతుంది. ప్రస్తుత పారితోషికం లెక్కల ప్రకారం చూస్తే .. రాజమౌళి దరదాపుల్లో కూడా ఏ దర్శకుడు లేడనే చెప్పాలి.