Prabhas Kalki 2: రెబల్‌స్టార్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న కల్కీ-2 రీసెంట్‌గా ఓ అప్డేట్ వచ్చింది. దీంతోపాటు పార్ట్-2లో సినిమా చేసే మ్యాజిక్ కోసం ఆసక్తిగా తాను ఎదురుచూస్తున్నట్లు ప్రభాస్ ఇటీవల కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఇక సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో కూడా చెప్పేశాడు.
కల్కి 2పై సినిమాపై ఇటీవల ఓ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ స్పందించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పార్ట్ 2లో ప్రభాస్ ఎక్కువసేపు స్క్రీన్‌పై కనిపిస్తారని అన్నారు. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్‌లోనే కథ సాగుందని చెప్పారు. రెండో భాగంలో వీరిద్దరి పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ' గతేడాది విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యాన్స్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా నాగ్ అశ్విన్ పుట్టిరోజు. సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రభాస్.. ఈ సందర్బంగా 'కల్కి 2' మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్న అంటూ ప్రభాస్ ఇస్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.
ఇస్టాగ్రామ్‌లో పోస్టుతోపాటు.. సినిమాలో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ కారులో అశ్విన్ కూర్చున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశాడు. ఈ అద్భుతమైన వ్యక్తికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు అని.. నాగ్ అశ్విన్ విజన్, కమిట్‌మెంట్ తనను ఎంతో ఇన్‌స్పైర్ చేస్తాయని అన్నారు. దీంతోపాటు కల్కీ-2 మ్యాజిక్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు స్టోరీలో రాసుకొచ్చారు.
కల్కి మొదటి భాగాన్ని అశ్వినీదత్ తన వైజయంతి మూవీస్ బేనర్‌పై నిర్మించారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు, తమిళ్ హీరో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా అలరించాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి తదితరులు అతిథులుగా సందడి చేశారు. ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో పార్ట్-2ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.
రీసెంట్‌గా కల్కీ-2 ఎప్పుడు విడుదల చేస్తారని అభిమానులు అడగ్గా.. నాగ్ అశ్విన్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. లాస్ట్‌టైమ్ కల్కి 2898 AD 3, 4 గ్రహాలు కలిసిన తర్వాత విడుదల చేస్తామని చెప్పానని, ఇక పార్ట్2కి 7-8 గ్రహాలు కలిసిన తర్వాత రీలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.