‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లతో తమ సంతోషాన్ని తెలియజేశారు.
సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడం సినీలోకానికి పండగ వాతావరణాన్ని తెచ్చింది. అసాధారణమైన విజయాన్ని సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అత్యున్నత ఆస్కార్ అవార్డు ఇండియాకు దక్కడం, అందులోనూ తెలుగు సినిమాకు ప్రకటించడం ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణంగా మారిపోయింది. ఇంతటీ ఘనతకు కారణమైన దర్శకుడు రాజమౌళి Oscars పొందడం పట్ల ట్వీట్ వేదికన ఆసక్తికరంగా స్పందించారు. ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
లాస్ ఎంజెల్స్ లోని ప్రముఖ డాల్బీ థియేటర్ లో 95వ అకాడమీ అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సిప్లిగంజ్, కాలభైరవ, తదితరులు హాజరయ్యారు. అత్యుత్తమ వేదికపై ‘నాటు నాటు’కు అవార్డును ప్రకటించడం, ఎంఎం కీరవాణి, చంద్రబోస్ సీక్వరించడం పట్ల దేశంమొత్తం సంతోషిస్తోంది. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సైతం అవార్డుపై స్పందించారు. అయితే జక్కన్న ఒక్కటే మాటలో తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. ఆర్ఆర్ఆర్ సాధించిన ఘనతను మాటల్లో వర్ణించలేక ట్వీట్ లో త్రివర్ణ పతాకాన్ని చూపించి ‘జైహింద్’ అని పేర్కొన్నారు.
Jai Hind 🇮🇳
— rajamouli ss (@ssrajamouli)జక్కన్న ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘నాటు నాటుకు మేం ఆస్కార్ ను సాధించాం. ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి, చంద్రబోస్ గారికి శుభాకాంక్షలు. అలాగే భారతీయులకు, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆస్కార్ ను చూపిస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తారక్ అభిమానులు, ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ కూడా తిరిగి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
And we did it…
Congratulations Sir ji, Jakkanna , garu, the entire team and the nation 🇮🇳 pic.twitter.com/LCGRUN4iSs