భగవంతుడా అంతా నీదే భారం అంటే ఎలా:   శ్రుతిహాసన్

Published : Dec 06, 2016, 06:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
భగవంతుడా అంతా నీదే భారం అంటే ఎలా:   శ్రుతిహాసన్

సారాంశం

నాకు దైవభక్తి ఎక్కువ అంటున్న‌ నటి శ్రుతిహాసన్. ఒక్క దేవుడిని  కాదు అన్ని దేవుళ్లను పూజిస్తుంద‌ట‌.  మన పని మనం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అని అంటున్న నటి శ్రుతిహాసన్

 నాకు దేవుడిపై నమ్మకం అన్నది నాకే కలిగింది.ఇది ఎవరో చెప్పడంతో కలిగింది కాదు.దైవభక్తి అన్నదిసాధారణ పరిస్థితికి మించింది. ఒక్క దేవుడినని కాదు అన్ని దేవుళ్లను పూజిస్తాను. అలాగని నా ఇంటిలో దేవుని గది అంటూ ప్రత్యేకంగా ఉండదు. అరుునా ఎలా దేవునిపై నమ్మకం కలిగిందో నాకే తెలియదు. నాకు సమయం దొరికినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ల దైవార్చనలు చేసుకుంటాను.

పుణ్యస్థలాలను దర్శిస్తుంటాను. షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటాను. అరుుతే ఆ ఆలయాల్లో ఏ దేవుడున్నారన్న విషయం గురించి ఆలోచించను. గుడిలో దేవున్ని చూడగానే దండం పెట్టుకుంటాను.అలాగని నేనేమీ కోరుకోను అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. చిన్న చిన్న కోరికలు కోరుకుంటాను. అరుుతే మన బాధ్యతలను విస్మరించకూడదు. 

ఏమీ చేయకుండా భగవంతుడా అంతా నీదే భారం అని కూర్చోవడం సరికాదు. మన పని మనం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అని అంటున్న నటి శ్రుతిహాసన్ తాజాగా తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో తన తండ్రి కమలహాసన్‌తో కలిసి శభాష్‌నాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Shambhala Movie Review: శంబాల మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఆది సాయికుమార్‌ కి సాలిడ్‌ బ్రేక్‌
Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!