చూపే బంగారమాయెనే శ్రీవల్లీ... మనసులు దోచేసిన దేవిశ్రీ-సిద్ శ్రీరామ్, బన్నీ వీరలెవల్ యాక్టింగ్!

Published : Oct 13, 2021, 12:20 PM ISTUpdated : Oct 13, 2021, 12:34 PM IST
చూపే బంగారమాయెనే శ్రీవల్లీ... మనసులు దోచేసిన దేవిశ్రీ-సిద్ శ్రీరామ్, బన్నీ వీరలెవల్ యాక్టింగ్!

సారాంశం

ఉత్తమమైన లిరిక్స్ కి సిధ్ శ్రీరామ్ గొంతు తోడైతే ఆ మాధుర్యాన్ని వర్ణించలేము. అది శ్రీవల్లి పాటతో మారు రుజువైంది. ఒక్క హిందీ మినహా... సౌత్ లాంగ్వేజెస్ లో సిధ్ శ్రీరామ్ శ్రీవల్లి సాంగ్ ని ఆలపించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప నుండి సెకండ్ లిరికల్ 'శ్రీవల్లి' సాంగ్ విడుదల కావడం జరిగింది. అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో శ్రీవల్లి సాంగ్ ఉంది. సీనియర్ రచయిత చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ లిరిక్స్ ప్రాణం పోయగా... పాట చాలా సహజంగా, హాయిగా సాగింది. ఉత్తమమైన లిరిక్స్ కి సిధ్ శ్రీరామ్ గొంతు తోడైతే ఆ మాధుర్యాన్ని వర్ణించలేము. అది శ్రీవల్లి పాటతో మారు రుజువైంది. ఒక్క హిందీ మినహా... సౌత్ లాంగ్వేజెస్ లో సిధ్ శ్రీరామ్ శ్రీవల్లి సాంగ్ ని ఆలపించారు. 

రంగస్థలం సినిమాతో పల్లెటూరి పాత్రలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించవచ్చని, ఈ తరం ఇష్టపడేలా మలచవచ్చని దర్శకుడు సుకుమార్  నిరూపించారు. పుష్పలో Sukumar అంతకు మించిన ప్రయోగానికి తెరలేపినట్లు తెలుస్తుంది. రెండు జడలు, లంగా జాకెట్... పక్కా పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా రష్మిక మందాన లుక్ కేక పుట్టించింది. ఇక Allu arjun ట్రాన్స్ఫార్మేషన్ వీర లెవెల్. ఈ పాటలో ఆయన వేసిన ఓ స్టెప్ నచ్చేసింది... హీరో హీరోయిన్ డీ గ్లామర్ లుక్స్ సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. 


మరి అమాయకపు అమ్మాయి వెంటపడే ఈ గంధపు చెక్కల స్మగ్లర్ కథేమిటో అనే ఆసక్తి పెరిగిపోయింది. ఇక పుష్ప డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రొమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. సినిమా విడుదలకు మూడు నెలల సమయం ఉండగానే ఒక్కొక్కటిగా పాటలు విడుదల చేస్తున్నారు. అల వైకుంఠపురంలో మూవీకి కూడా ఇదే స్ట్రాటజీ ఉపయోగించారు. ఆ సినిమా విజయంలో సాంగ్స్ ఎంత కీలకపాత్ర వహించాయో తెలిసిందే. 

Also read MAA elections: ఎన్నికల రగడ.. కోర్ట్ కి వెళతానంటున్న యాంకర్ అనసూయ!


ఐదు భాషల్లో రెండు భాగాలుగా పుష్ప విడుదల కానుంది. మలయాళ టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ పుష్ప చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ తో పుష్ప తెరకెక్కిస్తున్నారు. యాంకర్ అనసూయ పుష్ప చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. 

Also read ‘ఆరడుగుల బుల్లెట్’ నాలుగు రోజుల కలెక్షన్స్ షాకింగ్

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్
OTT Movies: ఓటీటీలో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు క్రేజీ కామెడీ సినిమా.. ప్రైమ్‌లో టాప్ 10 మూవీస్‌ ఇవే