శ్రీనువైట్లకి ప్రాజెక్ట్ సెట్ అయింది.. హీరో ఎవరంటే..?

Published : Apr 03, 2019, 03:28 PM IST
శ్రీనువైట్లకి ప్రాజెక్ట్ సెట్ అయింది.. హీరో ఎవరంటే..?

సారాంశం

వరుస డిజాస్టర్ లతో డీలా పడ్డ శ్రీనువైట్లతో మంచు విష్ణు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'మిస్టర్' ఫ్లాప్ తో శ్రీనువైట్లకి ఇక ఆఫర్లు కష్టమని అనుకున్నారు. 

వరుస డిజాస్టర్ లతో డీలా పడ్డ శ్రీనువైట్లతో మంచు విష్ణు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'మిస్టర్' ఫ్లాప్ తో శ్రీనువైట్లకి ఇక ఆఫర్లు కష్టమని అనుకున్నారు. కానీ రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఇక ఇండస్ట్రీలో శ్రీనువైట్లకి ఛాన్స్ ఇచ్చే హీరోలు ఎవరూ ఉండరని భావిస్తున్న సమయంలో మంచు విష్ణు అతడితో సినిమా చేసే సాహసం చేస్తున్నాడు. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా వెల్లడించాడు.

తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న విష్ణు అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీనువైట్ల ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'ఢీ' అనే  సినిమా వచ్చింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబోలో సినిమా సెట్ అయింది.

త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నట్లు వెల్లడించాడు. ఇక రాజకీయాల విషయానికొస్తే.. ఇటీవలే విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలో చేరాడు. పార్టీ విజయం కోసం తనవంతు కృషి చేస్తానని చెబుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే