క్రెడిట్ మొత్తం హీరోకేనా..? మహేష్ హీరోయిన్ ఫైర్!

Published : Apr 03, 2019, 03:03 PM IST
క్రెడిట్ మొత్తం హీరోకేనా..? మహేష్ హీరోయిన్ ఫైర్!

సారాంశం

టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో పరిచయమైన కృతిసనన్ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ అవకాశాలు దక్కించుకుంటూ పాపులారిటీ సంపాదించే పనిలో పడింది. 

టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో పరిచయమైన కృతిసనన్ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ అవకాశాలు దక్కించుకుంటూ పాపులారిటీ సంపాదించే పనిలో పడింది.

రీసెంట్ గా ఈమె నటించిన 'లుకా చుప్పి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరో కార్తిక్ కి వెళ్లిపోవడంపై అమ్మడు ఓ రేంజ్ లో ఫైర్ అయింది.

'లుకా చుప్పి' సినిమా కేవలం కార్తిక్ వల్లే సక్సెస్ అయిందని అనడం కరెక్ట్ కాదని, ఒకవేళ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేకుండా హీరోనే ప్రధాన పాత్రలో నటించినప్పుడు అతడికి క్రెడిట్ ఇచ్చిందని అర్ధముందనిఅంది. కానీ ఈ సినిమా అలా కాదని కథను హీరో, హీరోయిన్లు సమానంగా భుజాలపై మోసినప్పుడు ప్రశంసలు కూడా ఇద్దరికీ దక్కాలి అంటూ చెప్పుకొచ్చింది.

కనీసం ఇప్పుడైనా ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. సహజీవనం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే