శ్రీను వైట్ల నెక్ట్స్.. ఆ హీరోతోనా..? వేరే దారిలేకేనా..?

By Udaya DFirst Published 19, Feb 2019, 3:29 PM IST
Highlights

రీసెంట్ గా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని అంటూ  వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల  ఓ పెద్ద డిజాస్టర్ ఇచ్చారు. తాను హీరోగా నిలదిక్కుకోవడానికి కారణమైన శ్రీను వైట్లకు  సపోర్ట్ ఇవ్వాలని రవితేజ చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

రీసెంట్ గా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని అంటూ  వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల  ఓ పెద్ద డిజాస్టర్ ఇచ్చారు. తాను హీరోగా నిలదిక్కుకోవడానికి కారణమైన శ్రీను వైట్లకు  సపోర్ట్ ఇవ్వాలని రవితేజ చేసిన ప్రయత్నం ఫలించలేదు. అయితే అదే మొదటి డిజాస్టర్ అయితే పెద్ద గా సమస్య లేకపోను. కానీ  వరసగా నాలుగు సినిమాలు ఫ్లాపవడంతో అతడికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. 

కనీసం యంగ్ హీరోలు కూడా ఇందుకు అంగీకరించడం లేదు. దాంతో చేస్తే కొత్త వాళ్లతో సినిమా చెయ్యాలి ..లేదా తనలాగే వెనక బడ్డ హీరోలతో సినిమా చెయ్యాలి. మొదట వాస్తవాన్ని అంగీకరించక స్టార్ హీరోలని ఎప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసారు. కానీ వాళ్లు డేట్స్ ఖాళీ లేవని, కథ బాగోలేదని ప్రక్కకు పెట్టేస్తున్నారు. దాంతో శ్రీనువైట్ల తనకు కామెడీ డైరక్టర్ గా బ్రేక్ ఇచ్చిన ఢీ సినిమా హీరో మంచు విష్ణుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అది కూడా ఢీ సీక్వెల్  అని తెలుస్తోంది. 

శీను వైట్ల కెరీర్ ని కలిదిల్చి ముందుకు ఉరికించిన చిత్రం ఢీ. అలాగే ఆ తర్వాత విడుదలైన రెడీ చిత్రం కెరీర్ కు మంచి ఊపుని ఇచ్చింది. దాంతో ఇప్పుడు శ్రీను వైట్ల తన ఢీ చిత్రానికి సీక్వెల్ రెడీ చేసే ప్లాన్ లో పడినట్లు సమాచారం. దానికి ఢీ రెడీ అనే టైటిల్ ని పెట్టి ట్యాగ్ లైన్ గా .....బి రెడీ అని పెట్టనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.   ఈ చిత్రం సీక్వెల్ కు కొందరు రచయతలతో స్క్రిప్టు వండుతున్నాడని వినికిడి. 

అయితే ఈ సారి అవే పాత్రలు ఉన్నా బ్యాక్ డ్రాప్ మాత్రం మారి పోతుందని, బ్రహ్మానందం పాత్ర మాత్రం ఈ సారి వేరే కమిడియన్ తో చేయిద్దామా లేక బ్రహ్మానందం నే ఉంచాలా అనే డైలమోలో ఉన్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క వరసగా సీక్వెల్ సినిమాలు ప్లాప్ కావటం కూడా శ్రీను వైట్లను సిక్వెల్ దిసగా నడవొద్దని కొందరు శ్రేయాభిలాషులు హెచ్చరిస్తున్నట్లు చెప్తున్నారు.

 

Last Updated 19, Feb 2019, 3:29 PM IST