విలన్ గా నాని.. థ్రిల్ చేయబోతున్నాడా..?

By Udaya DFirst Published 19, Feb 2019, 12:51 PM IST
Highlights

ఈ మధ్యకాలంలో హీరోలు కూడా విలన్ పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు యంగ్ హీరో నాని కూడా విలన్ గా మారి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

ఈ మధ్యకాలంలో హీరోలు కూడా విలన్ పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు యంగ్ హీరో నాని కూడా విలన్ గా మారి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సినిమాలు చేసిన నాని ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి సినిమా చేయబోతున్నాడు.

చాలా కాలంగా వార్తల్లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ అయినట్లు సమాచారం. కథ ప్రకారం ఈ సినిమాలో నాని విలన్ గా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయు. మరో నటుడు సుధీర్ బాబు హీరోగా కనిపిస్తాడని తెలుస్తోంది. 

సుధీర్ బాబు పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటిస్తుంటే.. నాని అతడికి విలన్ గా మారతాడు. అయితే కథ ప్రకారం ఏ పాత్రకి ఎంత వెయిట్ ఉండబోతుందనే విషయాలు ఇంకా తెలియలేదు. కానీ కథ విన్న నాని, సుధీర్ బాబులు చాలా ఎగ్జైట్ అయ్యారట.

విలన్ గా నాని రోల్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. అసలే నేచురల్ స్టార్.. పైగా విలన్ రోల్ ఇక ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తాడో చూడాలి!

Last Updated 19, Feb 2019, 12:51 PM IST